Melbourne Test : మెల్ బోర్న్ లో ఓటమికి ఎన్ని కారణాలున్నా.. ప్రముఖంగా వినిపిస్తున్నది మాత్రం ఆ మూడు క్యాచ్ మిస్ చేసిన విధానం.. ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ లో దాదాపు మూడు క్యాచులను టీమిండియా ఫీల్డర్ యశస్వి జైస్వాల్ వదిలేయడం మాచ్ స్వరూపాన్ని ఒక్కసారిగా మార్చేసింది. అందువల్లే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయినప్పటికీ.. లభించిన జీవ ధానాలను ఉపయోగించుకుని 234 పరుగుల దాకా చేయగలిగింది.
తొలి, రెండవ ఇన్నింగ్స్ లు కలుపుకొని టీమ్ ఇండియా ఎదుట 340 రన్స్ టార్గెట్ విధించింది. ఉస్మాన్ ఖవాజా, కమిన్స్, లబూ షేన్ క్యాచ్ లను జారవిడిచాడు. ఇలా కీలకమైన ముగ్గురు ఆటగాళ్ల క్యాచ్ లను నేలపాలు చేయడంతో.. ఆస్ట్రేలియా ప్లేయర్లు తమకు లభించిన జీవధానాలను ఉపయోగించుకున్నారు. ఫలితంగా ఆస్ట్రేలియా మెరుగైన స్కోర్ చేయడంలో తోడ్పడ్డారు. ఒకవేళ యశస్వి జైస్వాల్ ఆ క్యాచ్ లను కనుక అందుకొని ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.. ఆస్ట్రేలియా తక్కువ స్కోర్ కే ఆల్ అవుట్ అయ్యేది. చివరికి బోలాండ్, లయన్ కూడా టీమ్ ఇండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. చివరి వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇలా ఒక్కో దశలో ఆస్ట్రేలియా జట్టు ఒత్తిడిని అధిగమించుకుంటూ వెళ్ళింది కాబట్టి టీమిండియా పై పై చేయి సాధించింది.
రోహిత్ హెచ్చరించినప్పటికీ…
మెల్ బోర్న్ మైదానంలో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ సమయంలోనే యశస్వి జైస్వాల్ ను కెప్టెన్ రోహిత్ శర్మ హెచ్చరించాడు. గల్లి క్రికెట్ ఆడుతున్నావా అంటూ మండిపడ్డాడు. అయినప్పటికీ జైస్వాల్ తన ఫీల్డింగ్ తీరును మార్చుకోలేదు. మూడు క్యాచ్ లను నేలపాలు చేయడంతో టీమిండియా ఆ కర్మ ఫలాన్ని అనుభవించింది. మూడు క్యాచ్లు నేల విడవడంతో… ఆస్ట్రేలియా ఆటగాళ్లు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మెరుగైన స్కోరు చేసి ఆస్ట్రేలియా కు మరింత ఆధిక్యాన్ని అందించారు. ఫలితంగా ఆస్ట్రేలియా విధించిన 340 రన్స్ టార్గెట్ ను చేదించలేక టీమిండియా చేతులెత్తేసింది. అంతిమంగా గెలవాల్సిన మెల్ బోర్న్ మైదానంలో ఓటమిపాలైంది.
ఒకవేళ మార్చి ఉంటే..
జైస్వాల్ సక్రమంగా ఫీల్డింగ్ చేయని క్రమంలో.. అతని స్థానంలో మరొక ఆటగాడిని ఆస్థానంలో ఫీల్డింగ్ చేయిస్తే బాగుండేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మూడు క్యాచ్ లు జారవిడిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ తో మాట్లాడలేదని.. అతడికి దూరంగా జరిగాడని వార్తలు వినిపించాయి. అలా చేయకుండా జైస్వాల్ స్థానంలో మరొక ఆటగాడికి కనక ఫీల్డింగ్ చేసే అవకాశం కల్పిస్తే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేదని.. అప్పుడు టీమిండియా గెలిచి ఉండేదని అభిమానులు పేర్కొంటున్నారు. ఆ తప్పులను రోహిత్ మన్నించారు కాబట్టే.. టీమిండియా కు ఈ దుస్థితి దాపురించిందని.. పటిష్టమైన చర్యలు తీసుకుంటే టీమిండియా గెలిచి ఉండేదని అభిమానులు పేర్కొంటున్నారు..