Pawan Kalyan : ఒక సినిమా హీరో కి కానీ, హీరోయిన్ కి కానీ లుక్స్ మైంటైన్ చేయడం చాలా అవసరం. వెండితెర మీద కనిపించేటప్పుడు జనాలు ప్రధానంగా ఆకర్షితులు అయ్యేది ముందుగా లుక్స్ కోసమే. రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ లుక్స్ వేరే లెవెల్ లో ఉండేవి. ఆయన వెండితెరపై కనిపిస్తే పక్కన ఉన్న ఆర్టిస్టులు తేలిపోతారు. ఎంత అందమైన హీరోయిన్ అయినా సరే, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ముందు అనలేరు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత లుక్స్ కాస్త దెబ్బ తిన్నాయి అని అనుకునేలోపు, రోజుల వ్యవధిలో అదిరిపోయే లాగా తన లుక్స్ ని మార్చుకోగలడు. ఇది అసలు ఎలా సాధ్యం అని ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒక్కోసారి స్లిమ్ గడ్డం లో చాలా స్మార్ట్ గా, స్టైలిష్ గా కనిపిస్తాడు. మరోసారి పూర్తి గెడ్డంతో కనిపిస్తాడు.
గడ్డం తీసేసిన తర్వాత బూరె బుగ్గలతో ఒకసారి కనిపిస్తాడు. ఇలాంటి లుక్స్ తో సినిమా ఎలా చేస్తాడు రా బాబు అని అభిమానులు కంగారు పడేలోపు స్లిమ్ లుక్ లోకి వచ్చేస్తాడు. ఇలా రోజుకి ఒకలాగా కనిపిస్తూ ఉంటాడు. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన లుక్స్ చూసేందుకు అసలు బాగా అనిపించలేదు. ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ మూవీ షూటింగ్స్ ఉన్నాయి, ఆ సినిమాల షూటింగ్స్ కి ఇవే లుక్స్ తో పాల్గొంటాడా? అని అభిమానులు కంగారు పడ్డారు. ఇంతలోపే నేడు ఆయన స్మార్ట్ లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు. వచ్చే నెల 10 వ తారీఖున రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాని దిల్ రాజు తన 50 వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి నాల్గవ తేదీన రాజముండ్రి లో కనీవినీ ఎరుగని రేంజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి దిల్ రాజు పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథి గా పిలిచేందుకు నేడు మంగళగిరి లోని పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ కి విచ్చేశాడు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో విడుదల అవ్వగా, అవి బాగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ లుక్స్ ని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. మొన్ననే కథ లుక్స్ బాగాలేవని అనుకున్నాము, ఇంతలోపే ఇలా మారిపోయాడేంటి అని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ అలా రోజుల వ్యవధిలో లుక్స్ మార్చుకోవడానికి కారణం, లిక్విడ్ మెటీరియల్స్ ని డైట్ లో తక్కువగా తీసుకోవడం వల్లే. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కి తెలిసినన్ని యోగాసనాలు ఇండస్ట్రీ లో ఎవరికీ తెలియవు. వాటి ద్వారా కూడా ఆయన తన లుక్స్ ని అలవోకగా మార్చేసుకోగలడు, ఆయన లుక్స్ కావలసినప్పుడు కావలసినట్టు మార్చుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.