https://oktelugu.com/

Pushpa 2 collections : పుష్ప 2′ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. అల్లు అర్జున్ అరెస్ట్ ప్రభావం వల్ల రావాల్సిన దానికంటే 2 రెట్లు ఎక్కువ వచ్చిందిగా!

మొత్తం మీద పది రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా 1250 కోట్ల రూపాయిలు వచ్చాయని, ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 1500 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2024 / 10:47 AM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత రోజుకో ఆల్ టైం రికార్డుని నెలకొల్పుతూ మొదటి వారం లోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంది. గత రెండు రోజులుగా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం అభిమానులను ఏ రేంజ్ లో కలవర పెట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య అల్లు అర్జున్ జైలు నుండి బెయిల్ మీద విడుదల అయ్యాడు. దీంతో నేషనల్ వైడ్ గా అల్లు అర్జున్ హాట్ టాపిక్ అవ్వడం, సినిమాకి మరింత ప్లస్ అయ్యింది. రెండవ వీకెండ్ లో సెన్సేషనల్ నంబర్స్ బాక్స్ ఆఫీస్ వద్ద నమోదు అయ్యాయి.

    పది రోజుల్లో ఈ చిత్రానికి దాదాపుగా 14 మిలియన్ కి పైగా టిక్కెట్లు బుక్ మై షో యాప్ ద్వారా అమ్ముడుపోయాయట. ఇది ఆల్ టైం ఫాస్టెస్ట్ రికార్డు గా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ప్రభాస్ కల్కి చిత్రానికి 13 మిలియన్ కి పైగా టికెట్స్ అమ్ముడుపోగా, పుష్ప 2 చిత్రం కేవలం 10 రోజుల్లో ఆ రికార్డు ని అధిగమించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఫుల్ రన్ లో బాహుబలి 2 చిత్రానికి 16 మిలియన్ కి పైగా టికెట్స్ అమ్ముడుపోగా, కేజీఎఫ్ 2 చిత్రానికి 17 మిలియన్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. పుష్ప 2 రన్ ముగిసేలోపు ఈ రెండు రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి 10 రోజులకు కలిపి 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట.

    10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. దీంతో ఈ చిత్రానికి 10 రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో 262 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 176 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా నార్త్ ఇండియా లో ఈ చిత్రానికి 10 వ రోజు దాదాపుగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు సమాచారం. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 10 వ రోజు 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని, మొత్తం మీద పది రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా 1250 కోట్ల రూపాయిలు వచ్చాయని, ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 1500 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.