WTC Final Scenario : టీమిండియా గబ్బా టెస్టులో ఓడిపోతే.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ వెళ్లడం దాదాపు కష్టమే. అయితే భారత్ ఫైనల్ వెళ్లడానికి ఇంకా కొన్ని అవకాశాలుంటాయి. ఈ ప్రకారం భారత్ ఆశలు నెరవేరాలంటే కచ్చితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫలితం అనుకూలంగా ఉండాలి. గబ్బా టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. స్మిత్, హెడ్ సెంచరీలతో కదం తొక్కారు. అయితే ఆస్ట్రేలియాకు తగ్గట్టుగా సమాధానం చెప్పడంలో భారత దారుణంగా విఫలమైంది. అడిలైడ్ మాదిరిగానే గబ్బాలోనూ టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. ఇప్పటివరకు అయితే నాలుగు వికెట్లు భారత్ కోల్పోయింది. ఈ ప్రకారం చూసుకుంటే గబ్బా మైదానంలో భారత్ ఓటమి పాలైతే.. మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లాలనే అడియాసలవుతాయి.
ఒకవేళ గబ్బా మైదానంలో కనుక భారత్ ఓడిపోతే
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మాత్రమే ఉన్నాయి. దక్షిణాఫ్రికా టెస్ట్ రేటింగ్స్ లో 63.33 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 60.71 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. భారత్ 57.29 పాయింట్లు తో మూడో స్థానంలో ఉంది. గబ్బా మైదానంలో కనుక భారత్ ఓడిపోతే మూడో స్థానంలో ఉంటుంది. పాయింట్లు పరంగా తగ్గుదల చవిచూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత టీమిండియా వరుసగా రెండు మ్యాచ్లను కనుక గెలిస్తే.. పాయింట్లు శాతం 58.8 కు చేరుకుంటుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పాయింట్లు 57 శాతానికి పడిపోతాయి. నీతో భారత్ రెండో స్థానానికి చేరుకుంటుంది. ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోతుంది. ఒకవేళ భారత జట్టు మిగతా జట్ల ఫలితాలపై ఏమాత్రం ఆధారపడకుండా.. నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవాలనుకుంటే కచ్చితంగా గబ్బా మైదానంలో జరిగే టెస్టులో కచ్చితంగా గెలవాలి. ఆ తర్వాత ఈ సిరీస్లో మిగతా రెండు మ్యాచ్లను కూడా కచ్చితంగా గెలవాలి. అయితే గబ్బా టెస్ట్ కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. అలాంటప్పుడు టీమిండియా గెలవడం సాధ్యం కాదు. పైగా ఈ మ్యాచ్ డ్రా అయితేనే టీమిండియా కు ఎంతో కొంత లాభం ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా బౌలర్ల ముందు టీమిండియా బ్యాటర్లు నిలబడలేక పోతున్నారు. సోమవారం భారత ఇన్నింగ్స్ సమయంలో గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లు అవుట్ అయిన విధానం దీనికి బలమైన ఉదాహరణ. స్టార్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా బౌలర్ల చేతిలో అవుట్ అయిన విధానాన్ని టీమిండియా అభిమానులు నెట్టింట ఓపెన్ గానే విమర్శిస్తున్నారు.