Pushpa 2 collection : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక పుష్ప 2 సినిమాతో తనకంటూ ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు. అయితే పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడానికి సుకుమార్ మొదటి నుంచి కూడా చాలా తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాడు. అయితే ఈ సినిమా 11 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 1300 కోట్ల కలెక్షన్లను రాబట్టిందంటూ సినిమా యూనిట్ నుంచి ఒక వార్త అయితే బయటకు వస్తుంది. అయితే మొత్తం గ్రాస్ కలెక్షన్స్ 1300 కోట్లుగా తెలుస్తోంది. కాగా అందులో షేర్ కలెక్షన్స్ రూపం లో 701 కోట్ల కలెక్షన్స్ ను సాధించినట్టుగా తెలుస్తోంది….
అసలు గ్రాస్ కలెక్షన్స్ అంటే ఏంటి? నెట్ కలెక్షన్స్, షేర్ కలెక్షన్స్ అంటే ఏంటి అనేది మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం… సినిమా మొత్తానికి టిక్కెట్ మీద వచ్చే డబ్బులను గ్రాస్ కలెక్షన్స్ అంటాము. ఇక పుష్ప 2 సినిమాకి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 1300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి అనుకుంటే, అందులో నెట్ కలెక్షన్స్ అంటే ఒకోస్టేట్ లో ఆయా గవర్నమెంట్ కి సినిమా ప్రొడ్యూసర్స్ టికెట్ల మీద వచ్చిన డబ్బులు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కింద కొంత పర్సంటేజ్ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో 12% మాత్రమే గవర్నమెంట్ కి చెల్లించాల్సి ఉంటుంది. ఇక మిగతా రాష్ట్రాల్లో మాత్రం మినిమం 40% ఉంచాల్సిన అవసరమైతే ఉంది. ఇక గ్రాస్ కలెక్షన్స్, నెట్ కలెక్షన్స్ తర్వాత షేర్ కలెక్షన్స్ ఉంటాయి. ఇక షేర్ కలెక్షన్స్ అంటే నెట్ కలెక్షన్స్ లో ఎంత అయితే ప్రాఫిట్స్ వస్తాయో దాంట్లో నుంచి థియేటర్ ఖర్చులను తీసేస్తే వచ్చేదే షేర్ కలెక్షన్స్… గ్రాస్ కలెక్షన్స్ అనేవి సినిమా రికార్డుల కిందకి లెక్కేస్తారు. కానీ షేర్ కలెక్షన్స్ అనేవి ప్రొడ్యూసర్ కి వచ్చే ప్రాఫిట్ ని చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అంటే షేర్ కలెక్షన్స్ ని మాత్రమే మనం లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది…
ఇక పుష్ప 2 ఇప్పటి వరకు ఒక్కో స్టేట్ లో లో ఎంత షేర్ వసూలు చేసింది అంటే…
తెలంగాణ, ఆంధ్రలో కలిపి 215 కోట్లను వసూలు చేసింది…ఇక కర్ణాటకలో 55 కోట్లు, తమిళనాడు 20 కోట్లు, కేరళలో 15 కోట్లు,నార్త్ లో 290 కోట్లు, ఓవర్సీస్ లో 106 కోట్ల షేర్ వసూలు చేసింది…ఇక మొత్తం గా 701 కోట్ల షేర్ ను వసూలు చేసింది…ఇక సినిమాను తీయడానికి దాదాపు 600 కోట్ల బడ్జెట్ అయింది…దాంతో ఇప్పుడు ఈ సినిమాకి 1300 కోట్ల కలెక్షన్స్ వచ్చిన కూడా అన్ని ట్యాక్స్ పోను ప్రొడ్యూసర్స్ కి 701 కోటి షేర్ వస్తుంది. అంటే అందులో నుంచి పెట్టిన బడ్జెట్ 600 కోట్లు పోతే ప్రొడ్యూసర్ కి వచ్చేది కేవలం 100 కోట్లు మాత్రమే…
ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో 2000 కోట్లు వసూలు చేస్తే ప్రొడ్యూసర్స్ కి మరో కొంత లాభం వస్తుంది…ఇక థియేటర్ వల్ల ప్రొడ్యూసర్స్ కి వచ్చే లాభాలు ఇవే…ఇక శాటిలైట్ రైట్స్, ఓటిటి రైట్స్ అనేవి డైరెక్ట్ గా ప్రొడ్యూసర్స్ కి వచ్చే ప్రాఫిట్… ఇక ఇప్పుడున్న రోజుల్లో ప్రొడ్యూసర్స్ కి థియేటర్ ప్రాఫిట్స్ కంటే ఓటిటి, శాటిలైట్ ద్వారానే ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…