US open 2024 : సమకాలీన టెన్నిస్ చరిత్రలో జకోవిచ్ తిరుగులేని ఆటగాడిగా కొనసాగుతున్నాడు.. ప్రస్తుతం అతడు వరల్డ్ నెంబర్ -2 ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇప్పటికి 24 టైటిల్స్ సాధించిన అతడు.. యూఎస్ ఓపెన్ లో విజేతగా ఆవిర్భవిస్తే 25వ టైటిల్ తన ఖాతాలో వేసుకుంటాడు. దీంతో అతడు యూఎస్ ఓపెన్ లో సత్తా చాటుతాడా? 25వ టైటిల్ తన ఖాతాలో వేసుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ 25వ టైటిల్ గెలిస్తే సరికొత్త చరిత్ర అతడి సొంతమవుతుంది. 25వ టైటిల్ గెలిచిన తొలి ఆటగాడిగా అతడు చరిత్రలో నిలిచిపోతాడు. ఇప్పటివరకు 24 టైటిల్స్ సాధించి మార్గరెట్ కోర్ట్ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. పారిస్ వేదికగా జరిగిన ఒలంపిక్స్ లో జకొవిచ్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఒలింపిక్స్ లో అతడు తిరుగులేని ఫాం కొనసాగించాడు. స్పెయిన్ ఆటగాడు అల్కారాస్ ను మట్టి కరిపించి, పసిడి పతకం దక్కించుకున్నాడు..
గత యూఎస్ ఓపెన్ లో జకోవిచ్ టైటిల్ దక్కించుకున్నాడు. ఈసారి కూడా అతడే గెలుస్తాడని అతడి అభిమానులు భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితిలో అతడికి అంత సులభంగా లేవని తెలుస్తోంది.. అల్కా రాస్ తో జకోవిచ్ తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాడు. మరోవైపు ప్రపంచ నెంబర్ వన్ జానెక్ సినర్ కూడా కాచుకొని ఉన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్లో అల్కారాస్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు. వింబుల్డన్ దక్కించుకున్నాడు. వింబుల్డన్ ఫైనల్లో జకో విచ్ పై విజయం సాధించి.. ట్రోఫీ అందుకున్నాడు.. సినర్ కూడా ఆస్ట్రేలియా ఓపెన్ లో విజేతగా ఆవిర్భవించాడు. అటు సినర్, ఇటు అల్కారాస్ పోటా పోటీగా ఉండడంతో.. జకో విచ్ కు ఇబ్బంది కర పరిస్థితి తప్పేలా లేదు. ఇక ప్రస్తుత యూస్ ఓపెన్ తొలి రౌండ్ జకోవిచ్ కు నల్లేరు మీద నడక లాగానే ఉంది. తొలి రౌండు పోటీలో అతడు 138 వ ర్యాంకర్, మోల్డోవా దేశానికి చెందిన అల్బాట్ తో పోటీ పడనున్నాడు.
మహిళల గ్రాండ్ స్లామ్ పోటీ కూడా ఆసక్తికరంగా కనిపిస్తోంది. డిపెండ్ నుంచి ఛాంపియన్ కోకో గాఫ్, స్వైటెక్, సబలెంక, రిబకినా, పెగులా, జెంగ్ క్విన్ వెన్, క్రేజి కోవా ఫేవరెట్లు గా కనిపిస్తున్నారు. మన దేశం నుంచి పురుషుల సింగిల్స్ లో నమిత్ నగాల్ పోటీ పడుతున్నాడు. డబుల్స్ విభాగంలో బోపన్న – ఎబ్డెన్, యుకి బాంబ్రి – అల్బానో, శ్రీరామ్ బాలాజీ – ఆండ్రియోజి పోటీలో ఉన్నారు.