https://oktelugu.com/

Stree 2 Collection: 1000 కోట్ల వైపు దూసుకుపోతున్న ‘స్త్రీ2’..10 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయంటే!

ప్రభాస్ 'కల్కి' చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి కేవలం బాలీవుడ్ నుండి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వసూళ్లను 'స్త్రీ2' చిత్రం కేవలం 5 రోజుల్లోనే దాటి ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 26, 2024 / 12:12 PM IST

    Stree 2 Collection(2)

    Follow us on

    Stree 2 Collection: వందల కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు ఒక్కోసారి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతుంటాయి. అదే విధంగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన కొన్ని చిన్న సినిమాలు మాత్రం ఎవ్వరి ఊహలకు అందని అద్భుతాలను నెలకొల్పుతూ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంటాయి. ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘స్త్రీ 2’ చిత్రం అలాంటి మ్యాజిక్ నే చూపిస్తుంది. ప్రీమియర్ షోస్ నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఆ తర్వాత మొదటి రోజు నుండి కనీవినీ ఎరుగని వసూళ్లతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఈ ఏడాది విడుదలైన ప్రభాస్ ‘కల్కి’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి కేవలం బాలీవుడ్ నుండి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వసూళ్లను ‘స్త్రీ2’ చిత్రం కేవలం 5 రోజుల్లోనే దాటి ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేసింది.

    ఇప్పటి వరకు ఈ సినిమా 10 రోజులకు గానూ 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అందులో కేవలం ఇండియా నుండి వచ్చిన వసూళ్లు 426 కోట్ల రూపాయిలు అవ్వగా, ఓవర్సీస్ నుండి వచ్చిన వసూళ్లు 78 కోట్ల రూపాయలుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అలాగే నెట్ వసూళ్ల విషయానికి వస్తే 361 కోట్ల రూపాయిలు వచ్చాయట. కేవలం రెండవ వీకెండ్ నుండే ఈ చిత్రానికి 93 కోట్ల రూపాయిలు వచ్చాయట. ఇది బాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం రికార్డు అని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. ఈ సినిమా తర్వాత రెండవ వీకెండ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాలుగా గద్దర్ 2 , ఎనిమల్, జవాన్ చిత్రాలు నడిచాయి.

    ఇదే ఊపుని ఈ సినిమా కొనసాగిస్తూ ముందుకు పోతే రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ప్రతిష్టాత్మక వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కూడా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే కనుక జరిగితే ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఏ చిత్రానికి దక్కని రెండు ఘనతలు ఈ సినిమాకి దక్కుతాయి. అందులో మొదటిది ఏమిటంటే పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లోనూ విడుదలైన సినిమాలు మాత్రమే ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాయి. కానీ ఒక్క ప్రాంతీయ చిత్రానికి కూడా వెయ్యి కోట్ల రూపాయిల వసూళ్లు రాలేదు. స్త్రీ2 ఒకవేళ వెయ్యి కోట్లు సాధిస్తే, వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టిన మొట్టమొదటి ప్రాంతీయ చిత్రంగా నిలిచిపోతుంది. ఇక రెండవ ఘనత ఏమిటంటే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కి ఈ స్థాయి వసూళ్లు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. ఆ ఘనత సాధించిన ఏకైక చిత్రంగా కూడా ‘స్త్రీ2’ నిలుస్తుంది.