https://oktelugu.com/

CSK vs DC: నిన్నటి మ్యాచ్ లో ధోని ఆ ఒక్కటి చేసి ఉంటే సిఎస్కే భారీ విక్టరీ కొట్టేదా..?

చెన్నై ఓడిపోయిన కూడా ఆ టీమ్ అభిమానులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ధోని తన మెరుపు ఇన్నింగ్స్ తో టీమ్ ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం అయితే చేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : April 1, 2024 10:01 am
    If Dhoni had done that one thing in yesterday match, would CSK have won a huge victory

    If Dhoni had done that one thing in yesterday match, would CSK have won a huge victory

    Follow us on

    CSK vs DC: ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై టీం ను చిత్తు చేసి ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఇక దీంతో ఈ సీజన్ లో ఢిల్లీ టీమ్ మొదటి గెలుపును నమోదు చేసుకుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో ఢిల్లీ ప్లేయర్లు అద్భుతమైన పర్ఫామెన్స్ ను ఇచ్చారు. మరీ ముఖ్యంగా డిల్లీ టీమ్ లో కీలక బౌలర్ అయిన కలిల్ అహ్మద్ తనదైన రీతిలో మంచి బౌలింగ్ పర్ఫామెన్స్ ని ఇస్తూనే చెన్నై టీమ్ ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

    ఇక ఇదిలా ఉంటే చెన్నై ఓడిపోయిన కూడా ఆ టీమ్ అభిమానులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ధోని తన మెరుపు ఇన్నింగ్స్ తో టీమ్ ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఒకప్పుడు ధోని ఎలాగైతే ప్రత్యర్థి బౌలర్ల మీద విరుచుకుపడేవాడో అలాంటి ఒక ధోని మళ్ళీ మనకు ఈ మ్యాచ్ లో కనిపించాడు.ఇక ఇదిలా ఉంటే చెన్నై టీం గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది.

    అది ఏంటి అంటే ధోని కనక ఒక్క ఓవర్ ముందు గా బ్యాటింగ్ కి వచ్చినట్టయితే ఈ మ్యాచ్ ఈజీగా చెన్నై సూపర్ కింగ్స్ గెలిచేది అంటూ చాలామంది అభిమానులతో పాటు సీనియర్ ప్లేయర్లు కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ధనాధన్ ధోని 16 బంతుల్లో 37 పరుగులు చేసి ప్రేక్షకులను విపరీతమైన ఆనందానికి గురి చేశాడు… అందులో 3 సిక్స్ లు, 4 ఫోర్లు ఉండటం విశేషం… ఇక చివరి బంతిని కూడా ధోని సిక్స్ తో ముగించాడు. దాంతో చెన్నై అభిమానులు ఓటమిని కూడా సెలబ్రేట్ చేసుకునే విధంగా ధోని ఈ మ్యాచ్ ను మార్చాడు.

    ఇక మొత్తానికైతే మహేంద్రుడు 42 సంవత్సరాల వయసులో కూడా బ్యాటింగ్ లో తన దమ్ము ఏంటో మరోసారి చూపించడం నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. దీంతో ఇక మీదట జరగబోయే మ్యాచ్ ల్లో ధోని ఆటను చూడటానికి అభిమానులు విపరీతంగా పోటీ పడే అవకాశాలు కూడా ఉన్నాయి…