T20 World Cup 2024: టి 20 వరల్డ్ కప్ కోసం ఈ 12మంది ఇండియన్ ప్లేయర్లు ఖాయం.. లిస్ట్ లో ఎవరంటే..?

ప్రతి టీం కూడా తమ తమ టీం ని టి20 వరల్డ్ కప్ కోసం సంసిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అమెరికా వెస్టిండీస్ ఇక అందులో భాగం గానే బీసీసీఐ కూడా టి20 వరల్డ్ కప్ కోసం టీం ని రెడీ చేసే ప్రయత్నంలో ఉంది.

Written By: Gopi, Updated On : April 1, 2024 10:07 am

indian squad for t20 world cup 2024

Follow us on

T20 World Cup 2024: ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఐపీఎల్ ఫీవర్ తోనే నడుస్తుంది. ఎక్కడ చూసిన ఐపీఎల్ గురించే చర్చలు సాగుతున్నాయి. ఇక మొత్తానికైతే ఈ ఐపీఎల్లో ప్రతి టీం తమ సత్తా చాటుతూ ముందుకు కదులుతుంది. ఇక ఇదిలా ఉంటే మే 26వ తేదీ వరకు సాగే ఈ ఐపీఎల్ లో ఈసారి టైటిల్ గెలుచుకునే టీమ్ ఏది అనే దానిమీద కూడా తీవ్రమైన చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక దానికి తోడుగా ఐపీఎల్ ముగిసిన వెంటనే అంటే కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే టి 20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వనున్న విషయం మనకు తెలిసిందే…ఇక అందులో భాగంగానే ఈ వరల్డ్ కప్ లో 20 టీమ్ లు పాల్గొనబోతున్నాయి.

ఇక దానికి సంబంధించిన ప్రతి టీం కూడా తమ తమ టీం ని టి20 వరల్డ్ కప్ కోసం సంసిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అమెరికా వెస్టిండీస్ ఇక అందులో భాగం గానే బీసీసీఐ కూడా టి20 వరల్డ్ కప్ కోసం టీం ని రెడీ చేసే ప్రయత్నంలో ఉంది. అయితే ఇప్పటికే టీమ్ లో మంచి ఫామ్ లో ఉన్న కొంతమంది ప్లేయర్లను బీసీసీఐ కన్ఫర్మ్ చేసుకుంది. ఇక మిగిలిన ప్లేయర్ల విషయంలోనే ఎవరిని తీసుకోవాలి అనే దానిమీద ఎక్కువ కసరత్తులనైతే చేస్తుంది. ఇక మొత్తం 15 మంది ప్లేయర్లకు గాను 12 మంది ప్లేయర్లు ఆల్మోస్ట్ సెట్ అయ్యారు. ఒక ముగ్గురు ప్లేయర్ల కోసమే తీవ్రమైన పోటీ అనేది కొనసాగుతుంది. ఇక ఐపీఎల్ లో ఎవరైతే మంచి ప్రదర్శనను కనబరుస్తున్నారో వారిని టీంలోకి తీసుకునే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక టి20 వరల్డ్ కప్ కి ఒక నెల ముందే అన్ని జట్లు తమ టీమ్ మెంబర్స్ ని ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ చివరి వారం వరకు బీసీసీఐ 15 మంది ప్లేయర్లతో కూడిన ఒక టీమ్ ని అనౌన్స్ చేసే ప్రయత్నంలో ఉంది. ఇక ఇప్పటివరకు టీమ్ లో ప్లేస్ సంపాదించుకునే ప్లేయర్లను కనుక మనం ఒకసారి చూసుకున్నట్టైతే రోహిత్ శర్మ కెప్టెన్ గా వరల్డ్ కప్ లో తన సేవలను అందించడానికి రెడీగా ఉన్నాడు. ఇక వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉంటాడు. ఇక టీమ్ భారాన్ని మోసే ప్లేయర్ గా విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ గా కె ఎల్ రాహుల్, ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా, స్పిన్నర్ గా కుల్దిప్ యాదవ్, యార్కర్ల స్పెషలిస్ట్ గా జస్ప్రీత్ బుమ్రా, రిజర్వుడు ఓపెనర్లుగా శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్ లాంటి ప్లేయర్లు ఉన్నారు.

ఇక సూర్య కుమార్ యాదవ్, రింకు సింగ్ లాంటి ప్లేయర్లు కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. మిగిలిన ప్లేయర్లలో ధ్రువ్ జురెల్, సంజు శాంసన్, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. మరి వీళ్ళలో ఎవరు టీమ్ కి సెలెక్ట్ అవుతారు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…