Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ మాటల్లో చెప్పక్కర్లేదు. అభిమానులే లైక్స్, వ్యూస్ రూపంలో చూపించేస్తున్నారు. అదే తరహాలో బన్నీకి సంబంధించిన వీడియో, ఫోటో మూవీ ఇలా అప్టేట్ ఏదైనా చిటికెలో ప్రేక్షకులను తాకేస్తుంది.

నా మొల్తాడులో తాయెత్తు అంటూ రుద్రమదేవిలో బన్నీ పలికిన మాస్ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర ఫుల్ లెంత్ మాస్ క్యారెక్టర్ తో ‘ పుష్ప’ గా అలరించ బోతోన్న అల్లు వారి అబ్బాయిపై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా తెలుగు ఇండస్ట్రీలో క్రియేటివ్ థాట్స్ కి పెట్టింది పేరు సుకుమార్ ఇప్పటికే ఆర్య, ఆర్య2, అంటూ బంపర్ హిట్స్ కొట్టిన ఈ కాంబినేషన్లో వస్తోన్న పుష్ప మూవీ కోసం టాలీవుడ్ తో పాటు అభిమానులు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎర్రచందనం స్మిగ్లింగ్ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా పాటలు సైతం అభిమానులను అలరిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో టీజర్లు, పోస్టర్లు జనాల్లో భారీ అంచానలనే పెంచేస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సైతం తన దైన స్టైల్లో ఈ సినిమాకు పని చేస్తున్నారని ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చెప్పకనే చెప్తోంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన దాక్కో దాక్కో మేక సాంగ్ రీచ్ మామూలుగా లేదు. ఐదు భాషల్లో ఐదుగురితో ఈ పాట పాడించి దేవీశ్రీ సంగీత ప్రియులను అబ్బురపరిచారు.
Also Read: Mega Star Chiranjeevi: మెగాస్టార్ మూవీలో పాట పాడనున్న … బ్రిట్నీ స్పియర్స్ ?
శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన ఈ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది. శ్రీవల్లి పాత్రపై రూపొందించిన చూపేబంగారమాయనే శ్రీవల్లి అనే సాంగ్ ప్రోమోని సినిమా కంటే ముందే జనం సూపర్ హిట్ చేసేశారు. దీంతో చిత్ర యూనిట్ కూడా మంచి ఊపుమీదుంది. తెలుగు తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో సిద్ శ్రీరాం ఈ పాటను పాడగా, హిందీలో జావేదే అలీకి ఈ పాట పాడే అవకాశం దక్కింది.
Also Read: Sunny Leone: సన్నీ లియోన్ కి స్వర్గం కనిబడిందట ఎప్పుడో తెలుసా?
ఏదైమైనా కరోనాతో రెండేళ్ల పాటు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ని కోల్పోయిన ఆడియన్స్ కి పుష్ప త్వరలో ఫుల్ ఎంటర్టైన్ చేయడం మాత్రం పక్కా అని పుష్ప పోష్టర్స్, టీజర్స్, అండ్ సాంగ్స్ చెప్పకనే చెప్తున్నాయి. ఇదే గనుక జరిగితే! సుకుమార్, బన్నీ, దేవీశ్రీలకు ఈ కాంబినేషన్ కలిసొచ్చినట్లే కాదు, ఈ కాంబోలో హ్యాట్రిక్ పడినట్లే!