Nassau Stadium : అమెరికా వేదికపై తొలిసారి నిర్వహిస్తున్న టి20 వరల్డ్ కప్ లో.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది న్యూయార్క్ లోని నసావు మైదానం.. అయితే ఈ మైదానం రూపొందించిన విధానంపై అనేక విమర్శలు వచ్చాయి.. హైబ్రిడ్ పిచ్ తయారు చేశారని.. బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారని.. తీవ్రంగా గాయాలు అవుతున్నాయని ఆటగాళ్లు ఐసిసికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఐసీసీ ఆ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇక న్యూయార్క్ లోని ఆ క్రికెట్ మైదానం భారత్ వర్సెస్ అమెరికా మధ్య జరిగిన మ్యాచ్ చివరిదని తెలుస్తోంది. సోషల్ మీడియా లో వస్తున్న వార్తల ప్రకారం భారత్, అమెరికా మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ మైదానాన్ని కూల్చేస్తారని సమాచారం.
బేస్ బాల్ ను విపరీతంగా ఆదరించే అమెరికాలో, క్రికెట్ కు ఆదరణ కలిగించాలని ఐసీసీ t20 వరల్డ్ కప్ కోసం అమెరికాను ఆతిధ్యదేశంగా ఎంపిక చేసింది. లీగ్ మ్యాచ్లను న్యూయార్క్, ఫ్లోరిడా, డల్లాస్ ప్రాంతాలలో నిర్వహించింది. ముఖ్యంగా న్యూయార్క్ లో 240 కోట్ల ఖర్చుతో క్రికెట్ మైదానాన్ని నిర్మించింది. 34 వేల సీటింగ్ సామర్థ్యంతో, కేవలం మూడు నెలల్లోనే ఈ మైదానాన్ని రూపొందించింది.. ఈ మైదానం డ్రాప్ ఇన్ పిచ్ లు రూపొందించడంతో ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల లో స్కోర్ లు నమోదవుతున్నాయి. ఊహించని బౌన్స్, టర్న్, పేస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో అభిమానులు ఈ మైదానాన్ని రూపొందించిన విధానం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మైదానంలో ఏడు మ్యాచ్లు జరగగా.. ఏ జట్టు కూడా 140 కి మించి పరుగులు చేయలేదు.
న్యూయార్క్ మైదానాన్ని తాత్కాలికంగా నిర్మించిన ఐసీసీ.. తర్వాత దానిని కూల్చేస్తుందట. వాస్తవానికి ఈ మైదానాన్ని 240 కోట్లతో నిర్మించారు. కేవలం ఏడు మ్యాచ్ల కోసం 240 కోట్లు ఖర్చు పెట్టారా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలంపిక్స్ లో క్రికెట్ క్రీడకు తిరిగి స్థానం దక్కేలా చేసేందుకు ఐసీసీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎన్ని వందల కోట్లు అయినా ఖర్చు చేసేందుకు ఏ మాత్రం వెనుకాడ లేదు.
The Nassau County International Cricket Stadium in New York, which was built for the T20 World Cup 2024, is set to be dismantled starting June 13, 2024. The stadium hosted eight matches during the tournament, including a notable game between India and Pakistan. The dismantling… pic.twitter.com/WAR1Wyuly9
— iNFO_CRIC|SPORTS (@cric_info_saif) June 13, 2024