ICC One Day Rankings : ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించిన అనంతరం టీమిండి ఆటగాళ్లు ర్యాంకింగ్స్ ను మరింతగా మెరుగుపరుచుకున్నారు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ 76 పరుగులతో రాణించిన నేపథ్యంలో.. అతడి ర్యాంక్ ఏకంగా మూడుకు చేరుకుంది. రోహిత్ శర్మ ఖాతాలో ప్రస్తుతం 756 పాయింట్లు ఉన్నాయి. గిల్ 784 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజాం 770 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఫైనల్ మ్యాచ్లో ఒక్క పరుగు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ 736 పాయింట్లకు పడిపోయాడు. దీంతో అతడు నాలుగు స్థానంలో నిలిచాడు. ఇక ఫైనల్ మ్యాచ్, ఇతర మ్యాచ్లలో అద్భుతంగా పాడిన కేఎల్ రాహుల్ ర్యాంక్ మరింత పడిపోవడం విశేషం. అతడి ఖాతాలో ప్రస్తుతం 638 పాయింట్లు ఉన్నాయి. అతడు 16వ ర్యాంకు లో కొనసాగుతున్నాడు.
Also Read : రోహిత్ ను అధిగమించిన విరాట్ కోహ్లీ.. అగ్రస్థానంలో గిల్..
బౌలర్ల విభాగంలో
బౌలర్ల విభాగంలో కులదీప్ యాదవ్ 650 పాయింట్లను సాధించి.. మూడవ ర్యాంకులో కొనసాగుతున్నాడు. శ్రీలంక సంచలన స్క్రీన్ బౌలర్ మహిశ్ తీక్షణ 680 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఖాతాలో ప్రస్తుతం 657 పాయింట్లు ఉన్నాయి. అతడు ఆరు స్థానాలు దూసుకు వచ్చి.. రెండవ ర్యాంకులోకి వచ్చాడు. ఇక రవీంద్ర జడేజా 616 పాయింట్లతో మూడు స్థానాలను మెరుగుపరుచుకుని పదవ ర్యాంకు సాధించాడు. ఆల్ రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా టాప్ -10 లో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో ప్రస్తుతం 220 పాయింట్లు ఉన్నాయి.. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు.
ప్లేయర్ ఆఫ్ మంత్ గా గిల్
వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న గిల్.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ గా ఎంపికయ్యాడు. గత నెలలో అతడు అద్భుతంగా ఆడిన నేపథ్యంలో ఈ పురస్కారం లభించింది. గత నెలలో గిల్ 5 వన్డేలు ఆడాడు. 94.19 సరాసరితో, 101.50 స్ట్రైక్ రేట్ తో 406 పరుగులు చేశాడు. ఇందులో అతడికి ఒక సెంచరీ, మూడు వరస ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.. స్మిత్, ఫిలిప్స్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ వారందరినీ వెనక్కి నెట్టి.. గిల్ ఈ పురస్కారాన్ని సాధించాడు. గిల్ ఇటీవలి ఇంగ్లాండ్ సిరీస్లో అదరగొట్టాడు. పరుగుల వరద పారించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లోను పర్వాలేదు అనే స్థాయిలో ఆట తీరు ప్రదర్శించాడు. స్థిరమైన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో అతడు తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read : టీమిండియాకు ఐసీసీ ఫేవర్ గా ఉంటోందట.. ఈ మాట అనడానికి నువ్వొక్కడివే తక్కువయ్యావు..