ICC Odi Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ ను మనోళ్లు గుత్తకు పట్టారా ఏంది?

వరల్డ్ కప్ తర్వాత ఎటువంటి వన్డే సిరీస్ ఆడినప్పటికీ.. వన్డే ర్యాంకింగ్స్ విషయంలో టీమిండియా ఆటగాళ్లు టాప్ లో ఉండడం గమనార్హం. ఐసీసీ ప్రకటించిన నూతన ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజం నెంబర్ వన్ ర్యాంక్ లో ఉన్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 21, 2024 4:31 pm

ICC Odi Rankings

Follow us on

ICC Odi Rankings: టెస్టుల్లో నెంబర్ వన్, వన్డేల్లో నెంబర్ వన్, టీ -20 ల్లో నెంబర్ వన్, WTC Rankings లో నెంబర్ వన్.. ఇలా నాలుగు విభాగాల్లో టీమిండియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.. ఆటగాళ్ల వ్యక్తిగత ర్యాంకింగ్స్ విషయానికొస్తే టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్, టి20 లో నెంబర్ వన్ బ్యాటర్ గా సూర్య కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. ఇప్పుడు వన్డే ర్యాంకింగ్స్ లో కూడా మనవాళ్లు హవా కొనసాగిస్తున్నారు. టాప్ -5 లో ఏకంగా ముగ్గురు చోటు సంపాదించుకున్నారు.

వరల్డ్ కప్ తర్వాత ఎటువంటి వన్డే సిరీస్ ఆడినప్పటికీ.. వన్డే ర్యాంకింగ్స్ విషయంలో టీమిండియా ఆటగాళ్లు టాప్ లో ఉండడం గమనార్హం. ఐసీసీ ప్రకటించిన నూతన ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజం నెంబర్ వన్ ర్యాంక్ లో ఉన్నాడు. 824 రేటింగ్ పాయింట్లతో ఆజం తిరుగులేని విధంగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. అతడికి పోటీగా టీమిండియా యువ సంచలనం శుభ్ మన్ గిల్ 801 రేటింగ్ పాయింట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. అతడు తర్వాత టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయినప్పటికీ 768 రేటింగ్ పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. ఇక గత జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం 764 రేటింగ్ పాయింట్లతో నాలుగవ స్థానానికి ఏగ బాకాడు. ఐర్లాండ్ ఆటగాడు హ్యారిటెక్టర్ పేలవ ప్రదర్శన చేయడంతో.. అది రోహిత్ శర్మకు వరంగా మారింది. ఇంతకుముందు టెక్టర్ నాలుగవ స్థానంలో ఉండేవాడు. ప్రస్తుతం అతడు 746 రేటింగ్ పాయింట్లతో రోహిత్ శర్మతో సరి సమానంగా ఉన్నాడు.

న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ 728 రేటింగ్ పాయింట్లతో ఆరవ స్థానంలో కొనసాగుతున్నాడు. సెవెన్ 23 రేటింగ్ పాయింట్లతో డేవిడ్ వార్నర్ ఏడవ స్థానంలో ఉన్నాడు. శ్రీలంక ఆటగాడు నిస్సాంక టాప్ 10 లోకి ప్రవేశించాడు. అతడు గత ర్యాంకింగ్ జాబితాలో 13వ స్థానంలో ఉండేవాడు. ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలన్ గత జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉండేవాడు. ప్రస్తుతం 9వ ర్యాంకుకు పడిపోయాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డసెన్ 701 రేటింగ్ పాయింట్లతో పదవ స్థానంలో కొనసాగుతున్నాడు. అటు టెస్టులు, ఇటు టి20లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న టీమిండియా.. వన్డేలోనూ అదరగొట్టింది. ఇక ఆటగాళ్లు కూడా తమ వ్యక్తిగత ర్యాంకింగ్స్ విషయంలో టాప్ స్థానంలో కొనసాగుతున్నారు.