https://oktelugu.com/

Eggs: రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? గుండె సమస్యలు ఉంటే గుడ్డు తినవచ్చా?

ప్రతి గుడ్డులో కొలెస్ట్రాల్ మాత్రం తప్పక ఉంటుంది. అయినా కానీ ఈ కొలెస్ట్రాల్ పెద్దగా ప్రభావం చూపదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా గుండెకు ప్రభావం చూపుతుందనే భయం కూడా లేదంటున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 21, 2024 / 04:35 PM IST

    Eggs

    Follow us on

    Eggs: గుడ్లు.. ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తినే ఈ గుడ్ల గురించి చాలా మందికి అనుమానాలు, అపోహలు ఉంటాయి. రోజు గుడ్డు తినాలా? వద్దా? తింటే లావు అవుతారా? కొలెస్ట్రాల్ పెరుగుతుందా. అనే భయం ఉంటుంది. అనేక ప్రయోజనాలు ఉన్న కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయం మాత్రం చాలా మందిలో ఉంటుంది. ఇంతకీ గుడ్లను తినవచ్చా? లేదా? ఎన్ని తినాలి? అనే వివరాలు ఇప్పుడు చూసేద్దాం..

    ప్రతి గుడ్డులో కొలెస్ట్రాల్ మాత్రం తప్పక ఉంటుంది. అయినా కానీ ఈ కొలెస్ట్రాల్ పెద్దగా ప్రభావం చూపదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా గుండెకు ప్రభావం చూపుతుందనే భయం కూడా లేదంటున్నారు. దీని వల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం మాత్రం ఉండదట. గుడ్డు పోషకాహార శక్తి కేంద్రాలుగా ఉంటాయనే విషయం తెలిసిందే. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ అనేకం. అంతేకాదు ఇందులో కోలిన్ కూడా ఉంటుంది కాబట్టి మెదడు కూడా ఆరోగ్యం ఉంటుంది.

    లాటిన్, జియాక్సంథిన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పదార్థాలు కళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో మంచి పాత్ర పోషిస్తాయి. ఇక గుడ్డులోని పచ్చసొన లో ఉండే రిబోఫ్లేవిన్ ఆరోగ్యంగా ఉండడానికి, పెరుగుదలకు అవసరమయ్యే విటమిన్ డి ఎముకలను ఆరోగ్యంగా ఉంచేలా తోడ్పడుతుంది. ఇక విటమిన్ బి-12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయం చేస్తుంది. మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది గుడ్డ పచ్చసొన. దీన్ని మితంగా తీసుకుంటే బరువు పెరుగుదలలో నియంత్రణ ఉంటుంది.

    గుండె సమస్యలు లేని వారు ప్రతి రోజు రెండు గుడ్లను తినవచ్చు అంటారు నిపుణులు. లేదంటే రోజు ఒక గుడ్డుతో సరిపెట్టుకోవాలి అని చెబుతున్నారు. వైద్యపరమైన, శారీరక సమస్యల ఉంటే కొలెస్ట్రాల్ విషయంలో భయపడాలని.. లేదంటే గుడ్లను తినడానికి ఎలాంటి భయం అవసరం లేదంటున్నారు డైటీషియన్లు. మరి తెలుసుకున్నారుగా ఒకసారి మీ వైద్యుడిని కూడా సంప్రదించి తినేయండి.