ICC ODI World Cup 2023 : వచ్చే ఏడాది భారతదేశంలో వన్డే ప్రపంచ కప్ పోటీల నిర్వహణకు సంబంధించి నీలి నీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. దీనివల్ల మ్యాచులను ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కుతుందని అభిమానులు ఆశపడ్డారు.. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వేరే విధంగా ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023 ఆతిథ్యం భారత్ నుంచి తరలిపోయే ప్రమాదం కనిపిస్తోంది.. ఇందుకు కారణం లేకపోలేదు.. భారత ప్రభుత్వానికి పన్నుల చెల్లింపు విషయమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ప్రపంచ కప్ కోసం భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపులను పొందాలని ఐసిసి భారత క్రికెట్ క్రీడా సమాఖ్యను కోరింది..

గతంలో ఇలా
ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే దేశాల నుంచి పన్ను మినహాయింపులు పొందాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు.. అయితే ఈ విషయంలో భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి సంకేతాలు అంతర్జాతీయ క్రికెట్ క్రీడా సమాఖ్యకు అందలేదు. దీంతో పన్ను చెల్లింపు విషయంలో తాము ఏమీ చేయలేమని భారత క్రికెట్ క్రీడా సమాఖ్య తేల్చి చెప్పింది. అవసరమైతే టోర్నమెంట్ ను భారతదేశంలో కాకుండా ఇతర చోట్ల నిర్వహించుకోవచ్చు అని అంతర్జాతీయ క్రికెట్ క్రీడా సమాఖ్య కు బీసీసీఐ స్పష్టం చేసింది.. 2016 టి20 ప్రపంచ కప్ భారతదేశంలో జరిగింది.. అప్పుడు కూడా భారత ప్రభుత్వం ఐసీసీకి పన్ను మినహాయింపులు ఇచ్చేందుకు నిరాకరించింది.. భారతదేశంలో చివరిగా 2011లో వన్డే ప్రపంచ కప్ జరిగింది. ధోని సారధ్యంలోని టీం ఇండియా విశ్వవిజేతగా నిలిచింది.. అయితే ఈ వివాదం తొందరగా ముగిసి ప్రపంచ కప్ జరగాలని టీం ఇండియా అభిమానులు ఆశిస్తున్నారు.
భారత క్రికెట్ క్రీడా సమాఖ్య కు చెప్పినా..
ఈ పన్ను మినహాయింపు విషయంపై అంతర్జాతీయ క్రికెట్ క్రీడా సమాఖ్య భారత క్రికెట్ క్రీడా సమాఖ్య కు చెప్పినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీనిపై భారత క్రికెట్ క్రీడా సమాఖ్య చేతులెత్తేసింది. తాను ఏం చేయలేనని నిస్సహాయత వ్యక్తం చేసింది. నేపథ్యంలో ఐసీసీ చెల్లించే ₹900 కోట్ల పన్నులకు సంబంధించి భారత క్రికెట్ క్రీడా సమాఖ్యలో కోత విధించాలని లేదా వేదిక మార్చాలని యోచిస్తోంది.. ఇదే జరిగితే భారత అభిమానులకు తీవ్ర నిరాశ మిగులుతుంది. అయితే భారత ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.