T20 World Cup 2024: ఐసీసీ T20 వరల్డ్ కప్-2024 సందర్భంగా కొత్త ఆవిష్కరణలు మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ గేమింగ్ అభిమానుల కోసం మరింత ఎగ్జయిటింగ్ గేమ్స్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామంలో భాగంగా అతి ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), ఫ్యాన్ క్రేజ్ వాటి భాగస్వాన్ని మరికొన్నేళ్లు పొడిగించనున్నట్లు ప్రకటించాయి.
అధికారికంగా లైసెన్స్ పొందిన వెబ్3 ఫాంటసీ గేమ్ ‘ఐసీసీ క్రిక్టోస్ సూపర్ టీం’కు సంబంధించి రాబోయే విడుదలపై కూడా ప్రకటన చేసింది. ఈ గేమ్ లో అభిమానులు తమ ఐసీసీ క్రిక్టోలను ఉపయోగించి ఫాంటసీ జట్లను ఏర్పాటు చేసుకోగలరు. ఈ పోటీల్లో పాల్గొని రోజూ బహుమతులను గెలుచుకోవచ్చు. ఇక, ప్రతీ వారం వారి క్రికెట్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపవచ్చు.
ఐసీసీ క్రక్టోస్ నిర్మించేందుకు ఫ్యాన్ క్రేజ్ తో కలిసి రెండేళ్ల నుంచి పని చేస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ఇది సరికొత్త గేమ్ అని పురుషులతో పాటు మహిళలు కూడా దీన్ని ఎక్కువగా ఇష్టపడతారనే నమ్మకం ఉందని తెలిపింది.
అభిమానులు ఆటను ఆస్వాదించే తీరును క్రిక్టోస్ మార్చుతుంది. క్రికెట్ చరిత్రలోనే గప్ప క్షణాలను సేకరించి డిజిటల్ వీడియోల రూపంలో గేమర్స్ కు అందిస్తామని పేర్కొంది. ఈ డిజిటల్ వీడియోల్లో మ్యాచ్ విన్నింగ్ ఐకానిక్ సిక్సర్ల నుంచి ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్ల మరపురాని ప్రదర్శనల వరకు క్రియేట్ చేసినట్లు భాగస్వామ్య సంస్థ తెలిపింది.
ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2022 కు హాజరైన అభిమానులకు ప్రత్యేక ఐసీసీ క్రిక్టోస్ ను బహుమతిగా ఇవ్వడం, ప్రత్యేకమైన తెరవెనుక అనుభవాల ద్వారా మునుపెన్నడూ లేనంతగా దగ్గర చేసింది. ఐసీసీ క్విజ్ నైట్, ఐసీసీ స్టేడియం టూర్స్ వంటి కార్యక్రమాలు అభిమానుల అనుభవాన్ని మరింత సుసంపన్నం చేశాయి. ఔత్సాహికులు తమ క్రీడాభిమానులను కలవడానికి, క్రికెట్ స్ఫూర్తిని జరుపుకునే ఆకర్షణీయమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాన్ని అందిస్తాయి.
ఐసీసీ డిజిటల్ హెడ్ ఫిన్ బ్రాడ్షా మాట్లాడుతూ ఐసీసీ క్రిక్టోస్ సూపర్ టీమ్ ను ఆవిష్కరించడం, ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్-2024 కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు కొత్త, వినూత్న గేమ్ ఫ్లో అనుభవాన్ని అందిస్తుందని, ఇది మాకు సంతోష కరంగా ఉందన్నారు. క్రికెట్ మరింత మందికి చేరువయ్యేందుకు క్రిక్టోస్ బాగా పని చేస్తుందని ఆయన తెలిపారు.
ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ 15 ఏళ్లుగా ఎంతో మంది దిగ్గజ క్షణాలను అందించిందని, ఫ్యాన్ క్రేజ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అన్షుమ్ భాంబ్రీ అన్నారు. క్రికెట్ అభిమానులుగా, మేం వ్యాపారాన్ని స్థాపించినప్పటి నుంచి సూపర్ టీంను ప్రారంభించాలని కలలు కంటున్నాము. అన్నారు.
‘క్రికెట్ అభిమానుల కోసం బలమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్న మాకు ఇది ఒక పెద్ద మైలురాయి, ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 సమయంలో అభిమానులు తమ ఐసీసీ క్రిక్టోస్ ను ఉపయోగించి ఫాంటసీ జట్లను ఏకతాటిపైకి తేవడాన్ని చూసేందుకు మేము వేచి ఉండలేం. సూపర్ టీం డిజిటల్ స్పోర్ట్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని, 100కు పైగా దేశాల్లో ఫ్యాన్ క్రేజ్ యూజర్ బేస్ ను పెంచుతుందని తెలిపారు.