ICC Cricket World Cup 2023: భారత్ తో సెమీస్ లో తలపడేది ఎవరు..? సెమీస్ బెర్త్ కోసం పోటీ లో ఉన్న ఆ నాలుగు టీంలు…

దాంతో 12 పాయింట్లతో సౌతాఫ్రికా టీం కూడా ఫైనల్ కి క్వాలిఫై అయింది. ప్రస్తుతం సౌతాఫ్రికా నెంబర్ 2 పొజిషన్ లో.కొనసాగుతుంది.ఇక నెంబర్ త్రీ పొజిషన్ లో ఆస్ట్రేలియన్ టీం 5 మ్యాచలలో మంచి విజయాలను అందుకొని...

Written By: Gopi, Updated On : November 6, 2023 3:55 pm
Follow us on

ICC Cricket World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రతి టీం కూడా తమదైన రీతిలో ఎఫర్ట్ పెట్టి మ్యాచ్ లను ఆడుతూ వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఇండియా టీమ్ ఇప్పటికే 8 మ్యాచ్ లు ఆడితే 8 మ్యాచ్ ల్లో మంచి విజయాలను అందుకొని 16 పాయింట్ల తో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. అదేవిధంగా సౌతాఫ్రికా ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడితే అందులో ఆరు మ్యాచ్ ల్లో విజయాలను సాధించి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.

దాంతో 12 పాయింట్లతో సౌతాఫ్రికా టీం కూడా ఫైనల్ కి క్వాలిఫై అయింది. ప్రస్తుతం సౌతాఫ్రికా నెంబర్ 2 పొజిషన్ లో.కొనసాగుతుంది.ఇక నెంబర్ త్రీ పొజిషన్ లో ఆస్ట్రేలియన్ టీం 5 మ్యాచలలో మంచి విజయాలను అందుకొని 10 పాయింట్ల తో నెంబర్ త్రీ పొజిషన్ లో కొనసాగుతుంది… ఇక ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా కూడా సెమీస్ కి చేరుకున్నట్టే ఎందుకంటే తను ఆడబోయే రెండు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ విజయం సాధించిన కూడా తను అఫీషియల్ గా సెమి ఫైనల్లోకి ఎంట్రీ ఇస్తుంది.ఇక ఆస్ట్రేలియా ఆడాల్సిన నెక్స్ట్ రెండు మ్యాచ్ ల్లో ఒకటి బంగ్లాదేశ్ తో ఆడనుండగా, రెండు ఆఫ్ఘనిస్తాన్ తో ఆడాల్సి ఉంది.దీంట్లో ఆఫ్ఘనిస్తాన్ ని ఓడించడం కొంతవరకు కష్టం అనుకున్న ,బంగ్లాదేశ్ ని మాత్రం ఈజీగా ఓడించవచ్చు కాబట్టి ఆస్ట్రేలియా టీమ్ సెమీఫైనల్ కి ఎంట్రీ ఇస్తుంది.ఇక నెంబర్ ఫోర్ లో సెమీ ఫైనల్ కి ఎవరు ఎంట్రీ ఇస్తారనే దాని మీదనే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది…

ఇక న్యూజిలాండ్ విషయాన్నీ తీసుకుంటే న్యూజిలాండ్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో మొదటి నాలుగు మ్యాచ్ లు మంచి విజయం సాధించిఆ తర్వాత ఆడిన వరుస నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.ఇక ఈ క్రమం లో న్యూజిలాండ్ స్మిస్ కి రావాలంటే శ్రీలంక తో ఆడే మ్యాచ్ లో గెలవాలి.ఇక దాంతో పాటు గా పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్ టీమ్ లు కూడా వాళ్ళు ఆడబోయే తర్వాత మ్యాచ్ ల్లో ఓడిపోవాలి అలా అయితేనే న్యూజిలాండ్ సెమీస్ కి క్వాలి ఫై అవుతుంది…ఇక మొన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో వర్షం పడటం తో ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడిపోయింది…

ఇక పాకిస్థాన్ టీమ్ విషయానికి వస్తే ఈ టీమ్ ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడితే అందులో 4 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.ఇక దాంతో ఇప్పుడు 8 పాయింట్ల తో పాకిస్థాన్ టీమ్ నెంబర్ ఫైవ్ పొజిషన్ లో కొనసాగుతుంది…ఇక ఇలాంటి క్రమం లోనే పాకిస్థాన్ తను నెక్స్ట్ ఇంగ్లాండ్ తో ఆడబొయే మ్యాచ్ లో విజయం సాధించాల్సి ఉంటుంది…ఇది గెలిస్తే రన్ రేట్ కూడా మెరుగ్గా ఉంటే సెమీస్ కి క్వాలిఫై అవుతుంది లేకపోతే పాకిస్థాన్ ఇంటికి వెళ్ళి పోవాల్సిందే…

ఆఫ్గనిస్తాన్ టీమ్ విషయానికి వస్తే న్యూజిలాండ్,పాకిస్థాన్ కంటే కూడా ఆఫ్గనిస్తాన్ టీమ్ కి సెమీస్ కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…ఇప్పటి వరకు అఫ్గాన్ టీమ్ 7 మ్యాచ్ లు ఆడితే అందులో 4 విజయాలను అందుకుంది.ఇక ఆ తర్వాత ఆడబోయే రెండు మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే వాళ్ళు కూడా సెమీస్ కి వచ్చే అవకాశం అయితే ఉంది…ఇక వీళ్ళు ఆడాల్సిన రెండు మ్యాచ్ లు కూడా వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీమ్ ల మీద ఉండగా ఆ రెండు కూడా పెద్ద
జట్లే కాబట్టి అఫ్గాన్ ఆ రెండింటినీ ఒడిస్తుందా అనేది తెలియాల్సి ఉంది…

ఇక సెమీస్ కి వచ్చిన టీమ్ ల్లో మొదటి ప్లేస్ లో ఉన్న టీమ్ నాలుగోవ ప్లేస్ లో ఉన్న టీమ్ తో మ్యాచ్ ఆడుతుంది. అలాగే రెండో స్థానం లో ఉన్న టీమ్ మూడో స్థానం లో ఉన్న టీమ్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది…