Sandeep: కర్మ ఈజ్ బ్యాక్ అంటూ సందీప్ సంచలన పోస్ట్… అతడితో బయటపడ్డ విభేదాలు!

నామినేషన్స్ అనేది చాలా సీరియస్ మేటర్ దాన్ని కూడా సిల్లీగా మార్చేస్తున్నాడు. దీన్ని ఆడియన్స్ గమనించాలి అంటూ ఏకిపారేశాడు సందీప్ మాస్టర్. ఇది ఇలా ఉండగా తేజ ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు.

Written By: Neelambaram, Updated On : November 6, 2023 3:49 pm
Follow us on

Sandeep: బిగ్ బాస్ సీజన్ 7 టేస్టీ తేజ హౌస్ లో ఎంటర్టైన్ చేస్తూ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. కాగా గత వారం సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయినందుకు పరోక్షంగా తేజ కారణమంటూ సందీప్ ఒక ఇంటర్వ్యూ లో సంచలన కామెంట్స్ చేశాడు. నువ్వు స్ట్రాంగ్ .. ఒక్కసారి నామినేషన్స్ ఫేస్ చేస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటూ సిల్లీ రీజన్ తో నామినేట్ చేశాడు. పైగా నేను నామినేట్ చేయమన్నాను అని .. హౌస్ లో లేని నా మీద తప్పుగా చెప్తున్నాడు. తేజ ఫేక్ ప్లేయర్,ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నాడు.

నామినేషన్స్ అనేది చాలా సీరియస్ మేటర్ దాన్ని కూడా సిల్లీగా మార్చేస్తున్నాడు. దీన్ని ఆడియన్స్ గమనించాలి అంటూ ఏకిపారేశాడు సందీప్ మాస్టర్. ఇది ఇలా ఉండగా తేజ ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు.మొదటి వారం నుంచి అలాగే జరుగుతుంది. ఒక్క రెండో వారం తప్ప మిగిలిన ఏడు వారాలు అదే జరిగింది. తేజ ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో లో తేజ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

కాగా తొమ్మిదో వారం నామినేషన్స్ లో శోభాశెట్టి,ప్రిన్స్ యావర్,అమర్ దీప్,టేస్టీ తేజ,ప్రియాంక జైన్,భోలే షావలి,అంబటి అర్జున్,అశ్విని శ్రీ ఉన్నారు. కాగా తేజ ఎలిమినేట్ కానున్నాడని రెండు రోజులుగా ప్రచారం జరిగింది. దాంతో సందీప్ మాస్టర్ తన ఇన్ స్టాలో వరుసగా పోస్టులు పెడుతున్నారు.తేజ ఎలిమినేటెడ్ అంటూ ఓ మీమ్ పేజీని షేర్ చేశాడు. అందర్నీ ఎలిమినేట్ చేస్తూ తానే ఎలిమినేట్ అయ్యాడు. ‘పాజిటివ్ వైబ్స్’ అంటూ ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేశారు. ప్రచారమైనట్లే తేజ ఆదివారం ఎలిమినేట్ అయ్యాడు.

కాగా ‘కర్మ హిట్స్ బ్యాక్ ‘గత వారం నీవల్ల ఒక మంచి ప్లేయర్ ఎలిమినేట్ అయ్యాడు ఇప్పుడు నీ వంతు అంటూ తన స్టోరీలో రాసుకొచ్చాడు సందీప్. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తేజ నామినేట్ చేయడం వలనే ఎలిమినేట్ అయ్యానని గట్టిగా నమ్ముతున్న సందీప్, తన ఆక్రోశం, ఆవేదన సోషల్ మీడియా ద్వారా వెళ్లగక్కుతున్నాడు. ఈ వారం మేల్ కంటెస్టెంట్స్ అందరూ నామినేట్ అయినట్లు సమాచారం.