Graduates MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటు వేయడంలో గ్యాడ్యుయేట్లు విఫలమయ్యారు. రెండు రాష్ట్రాల్లో రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండు స్థానాల్లోనూ భారీగా ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఇది గ్రాడ్యుయేట్ల అవగాహన లోపం, అవగాహన కల్పించడంలో ఈసీ వైఫల్యానికి నిదర్శనం. గ్రాడ్యుయేట్ ఓట్లు అంటే, డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత(Education Qualification) ఉన్నవారు ఓటర్లుగా నమోదు చేసుకుని, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీలను ఎన్నుకునే ప్రక్రియలో పాల్గొనే హక్కు ఉంటుంది. ఎన్నికల సమయంలో ఓటు వేసే ప్రక్రియలో లోపాల వల్ల లేదా నిబంధనలను పాటించకపోవడం వల్ల కొన్ని ఓట్లు చెల్లనివిగా పరిగణించబడతాయి. బ్యాలెట్ పేపర్‌పై సరిగ్గా గుర్తు పెట్టకపోతే లేదా ఒకటి కంటే ఎక్కువ మందికి ఓటు వేస్తే అవి చెల్లవు. గాడ్యుయేట్ ఓట్ల వ్యవస్థపై గతంలో కొన్ని విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవస్థను రద్దు చేయాలని లేదా సంస్కరించాలని కొందరు రాజకీయ నాయకులు, విశ్లేషకులు వాదించారు. ఇది చె ల్లనిదని అర్థం కాదు కానీ, దాని ఆవశ్యకత లేదా ప్రజాస్వామ్యభాగస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు.
భారీగా చెల్లని ఓట్లు..
ఆంధ్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలు ఉన్నాయి ఇటీవల జరిగిన ఉత్తరాంద్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో 27 వేల ఓట్లు చెల్లనివిగా పరిగణించబడ్డాయి. ఈమేరకు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ(Telangnan)లో జరిగిన మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ 28 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఈ పరిస్థితి చూసి రాజకీయ పార్టీల నేతలతోపాటు, ఎన్నికల అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంత భారీగా చెల్లని ఓట్లు అంటే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయని పోటీ చేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
అవగాహన కల్పించని అధికారులు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్లు చెల్లిబాటు కాకపోవడానికి మరో ప్రధాన కారణం ఈసీ. ఎన్నికల నోటిఫికేషన్(Notification) వచ్చిన నాటి నుంచే అవగాహన కల్పించాల్సి ఉంది. కనీసం కూడళ్లలో ఓటు వేసే విధానంపై కనీసం ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసేవారే వేల మంది ఉన్నారు. కనీసం వారికైనా అవగాహన కల్పించి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం పోలింగ్ రోజు కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఇది కూడా చెల్లని ఓట్లు ఎక్కువగా పోల్ కావడానికి కారణంగా భావిస్తున్నారు.
Also Read : ఉత్కంఠభరితంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్