Virat Kohli : రిటైర్మెంట్ ప్రకటించాక నేను మీ ఎవ్వరికీ కనిపించను : విరాట్ కోహ్లీ షాకింగ్ ప్రకటన

ఇక ప్రస్తుతం ఐపిఎల్ లో బెంగళూరు టీం తరపున ఆడుతున్న కింగ్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉండడమే కాకుండా ఈ సీజన్ లో ఒక సెంచరీని కూడా నమోదు చేశాడు...ఇక ఇప్పటి వరకు ఈ సీజన్ లో 13 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ 661 పరుగులు చేసి నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు...

Written By: NARESH, Updated On : May 16, 2024 1:35 pm

Virat Kohli

Follow us on

Virat Kohli : ఇండియన్ క్రికెట్ టీమ్ లో విరాట్ కోహ్లీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తన ఆట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించిన కోహ్లీ చాలా తక్కువ సమయంలోనే స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు. సచిన్ క్రియేట్ చేసిన రికార్డులను ఎవరు బ్రేక్ చేయలేరని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కొక్కటిగా విరాట్ కోహ్లీ వాటిని బ్రేక్ చేస్తూ వస్తున్నాడు.

ఇక మొత్తానికైతే కింగ్ కోహ్లీ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక తన మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా తను మాత్రం తన ఆటతోనే సమాధానం చెబుతూ వచ్చాడు. ఇక ఒక మ్యాచ్ లో స్కోర్ ను చేజింగ్ చేయడంలో కోహ్లీ ని మించిన ఆటగాడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ముందు టార్గెట్ కనిపిస్తుంది అంటే దానికోసం మ్యాచ్ చివరి వరకు అయినా సరే పోరాడి ఆ మ్యాచ్ ను విజయతీరాలకు చేర్చడంలో తను ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా కోహ్లీ ముందు రిటైర్మెంట్ ప్రస్తావన ప్రకటించగా, ఆయన “నేను ఆటగాడిగా ఉన్నాన్ని రోజులు నా ఆట కోసం నా సర్వస్వాన్ని ధారపోసి ఆడతాను.

అలాగే నేను ఒకసారి రిటర్మెంట్ ప్రకటించాను అంటే ఇక మీదట ఎవ్వరికీ కనిపించను” అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు… అంటే కోహ్లీ చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే ఆయన ఆట నుంచి విరామం ప్రకటించాడు అంటే తన వ్యక్తిగత జీవితం మీదనే తను ఎక్కువ ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇన్ని రోజులపాటు తన ఫ్యామిలీ లైఫ్ కి దూరంగా ఉంటూ వస్తున్నాడు.

కాబట్టి ముందుగా ఫ్యామిలీతో ఎక్కువ రోజులు గడపాలని ఆయన ప్లానింగ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటుగా కొన్ని బిజినెస్ లను కూడా ప్లాన్ చేసుకోబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఐపిఎల్ లో బెంగళూరు టీం తరపున ఆడుతున్న కింగ్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉండడమే కాకుండా ఈ సీజన్ లో ఒక సెంచరీని కూడా నమోదు చేశాడు…ఇక ఇప్పటి వరకు ఈ సీజన్ లో 13 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ 661 పరుగులు చేసి నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు…