Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం… ఎంత ప్రయత్నం చేసినా చేజారిన ప్రాణం!

ముక్కు అవినాష్-కెవ్వు కార్తీక్ ఓ టీమ్ కి లీడర్స్ గా ఉండేవారు. ముక్కు అవినాష్ ప్రస్తుతం జబర్దస్త్ లో లేడు. కాగా కార్తీక్ తల్లి మరణించడంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Written By: Gopi, Updated On : May 16, 2024 1:37 pm

jabardasth comedian kevvu karthik mother passed away

Follow us on

Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ విషయం తెలియజేసిన కార్తిక్ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే .. జబర్దస్త్ షో ద్వారా కార్తీక్ వెలుగులోకి వచ్చాడు. తక్కువ సమయంలోనే టీం లీడర్ గా ఎదిగాడు. తన టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ముక్కు అవినాష్-కెవ్వు కార్తీక్ ఓ టీమ్ కి లీడర్స్ గా ఉండేవారు. ముక్కు అవినాష్ ప్రస్తుతం జబర్దస్త్ లో లేడు. కాగా కార్తీక్ తల్లి మరణించడంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గత ఐదేళ్లుగా ఆయన తల్లి క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో కార్తీక్ తల్లి ఈటీవీలో ప్రసారమైన పలు ఈవెంట్స్ లో పాల్గొన్నారు. దీంతో ఆమె పూర్తిగా కోలుకున్నారు అని అంతా భావించారు. కానీ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బుధవారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. తల్లి మృతి వార్తను సోషల్ మీడియా వేదికగా కెవ్వు కార్తీక్ తెలిపాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

”అమ్మ .. గత 5 సంవత్సరాల రెండు నెలలుగా క్యాన్సర్ పై అలుపెరగని పోరాటం చేశావు. నీ జీవితం అంతా యుద్ధమే. మమ్మల్ని కన్నావు .. నాన్నకు తోడుగా కుటుంబాన్ని కష్ట పరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు. అమ్మ ఈ ఐదేళ్లలో ఎలా ఒంటరిగా పోరాడాలి అని నేర్పావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యం నింపింది. అన్ని నేర్పావు కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలి అని నేర్పించలేదు ఎందుకమ్మా.

మా అమ్మ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మా అమ్మకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు అందరికీ నా పాదాభివందనం” అంటూ కార్తీక్ రాసుకొచ్చాడు. దీంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కష్ట సమయంలో కార్తీక్ కి ధైర్యంగా ఉండాలని చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.