Monsoon : భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడతాయని ప్రకటించింది. ఈ నెలాఖారుకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు వెల్లడించింది. అయితే సాధారణంగా మే నెలలో నైరుతీ రుతుపవనాల రాక రికార్డ్. 150 సంవత్సరాల కిందట.. అంటే 1918 మే 11న ముందస్తుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. గత ఏడాది మాత్రం జూన్ 8న ప్రవేశించాయి. అయితే ఈ ఏడాది మాత్రం మే 31వ తేదీకి.. రెండు రోజులు అటూ ఇటూ గా ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో క్రమంగా బలహీన పడిన నేపథ్యం, ఇటు నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
గత ఏడాది వర్షాభావ పరిస్థితులతో.. దేశంలో కొన్ని ప్రాంతాల్లో కరువు ఛాయలు నెలకొన్నాయి. ఈ ఏడాది మార్చి నుంచే వేసవి ప్రతాపం చూపింది. ఏప్రిల్ లో ఎండలు మండిపోయాయి. చెరువులు, నదులు, కాలువల్లో నీరు ఎండిపోయింది. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవుతుందనే అంచనాలు ఉండడంతో దేశం మొత్తానికి భారీ ఉపశమనం లభించినట్లు అయ్యింది.
ప్రస్తుతం ఏపీలో భిన్న వాతావరణం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. అధికంగా నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. భారీ వర్షం పడుతోంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణ, ఉత్తరాంధ్రలో చెదురు మదురు వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు సేదతీరుతున్నారు. ఇప్పుడు నైరుతి రుతుపవనాలు ముందుగానే తాకుతాయి అన్న వార్త తెలియడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి రుతుపవనాలు ఎంతో కీలకమైనవి. సాగు విస్తీర్ణంలో 52% నీటిపైనే ఆధారపడింది. ఋతుపవనాల వల్ల కురిసే వర్షాలతోనే విద్యుత్ ఉత్పత్తి తో పాటు రిజర్వాయర్లలో నీటిమట్టం పెరుగుతుంది. అటు ఖరీఫ్ నకు సంబంధించి జూన్, జూలై నెలలు అత్యంత ప్రధానమైనవి. కానీ గత ఏడాది ఆ రెండు నెలల్లోనే వర్షాలు కురవలేదు. ఈ ఏడాది మాత్రం ఆ పరిస్థితి ఉండదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.