Lady Gaga : నాకు ఫ్రెంచ్ తో అవినాభావ సంబంధం… ఒలింపిక్ ప్రారంభ వేడుకల్లో లేడీ గాగా భావోద్వేగం..

ప్రారంభ వేడుకకు బార్బీ బొమ్మలాగా లేడీగాగ ముస్తాబయింది. గులాబీ రంగు దుస్తులు ధరించి ఆమె తన ప్రదర్శన ఇచ్చింది. అయితే ఆమె పాటలు పాడుతున్నప్పుడు ఫ్రెంచ్ లో మాట్లాడుతుందా? అనే ప్రశ్న వీక్షకుల్లో వ్యక్తం అయింది. 13 సార్లు గ్రామీ అవార్డును గెలుచుకున్న లేడీగాగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలలో తన ఆట - పాట తో సందడి చేసింది

Written By: Anabothula Bhaskar, Updated On : July 27, 2024 1:19 pm
Follow us on

Lady Gaga : నాకు ఫ్రెంచ్ తో అవినాభావ సంబంధం… ఒలింపిక్ ప్రారంభ వేడుకల్లో లేడీ గాగా భావోద్వేగం..ఒలింపిక్ ప్రారంభ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఆకాశమే హద్దుగా సాగిన సంబరాలు క్రీడాభిమానులకు సరికొత్త అనుభూతిని అందించాయి. పారిస్ వేదికగా సెన్ నది ఒడ్డున జరిగిన ఒలింపిక్ ప్రారంభ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించాయి. ఈ వేడుకలను చూసేందుకు ప్రపంచ దేశాల నుంచి సుమారు 3,20,000 మంది హాజరయ్యారు. ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఒలింపిక్ నిర్వహణ కమిటీ 80 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసింది. సెన్ నది పై ప్రత్యేకంగా సెట్ నిర్మించింది.. ఈ నదిలో పడవలపై క్రీడాకారులు ప్రేక్షకులకు అభివాదం చేశారు. పరేడ్లో భాగంగా ప్రత్యేక దుస్తులు ధరించి ఆకర్షణగా నిలిచారు. క్రీడల కోసం నిర్మించిన స్పోర్ట్స్ విలేజ్ లో ప్రత్యేకంగా ఎయిర్ షో నిర్వహించారు. బాణాసంచా కాల్చారు. ప్రారంభ వేడుకల్లో దేశ విదేశాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా అమెరికన్ పాప్ సింగర్ లేడీ గాగా నిలిచింది. తన పాటలతో ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది.

ప్రారంభ వేడుకకు బార్బీ బొమ్మలాగా లేడీగాగ ముస్తాబయింది. గులాబీ రంగు దుస్తులు ధరించి ఆమె తన ప్రదర్శన ఇచ్చింది. అయితే ఆమె పాటలు పాడుతున్నప్పుడు ఫ్రెంచ్ లో మాట్లాడుతుందా? అనే ప్రశ్న వీక్షకుల్లో వ్యక్తం అయింది. 13 సార్లు గ్రామీ అవార్డును గెలుచుకున్న లేడీగాగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలలో తన ఆట – పాట తో సందడి చేసింది. థామస్ జాలి నేతృత్వంలో ఈ వేడుకను ఒలింపిక్ కమిటీ సంప్రదాయ స్టేడియంలో కాకుండా సెన్ నది ఒడ్డున వేసిన ప్రత్యేకమైన సెట్ లో నిర్వహించింది. ఈ వేడుకల్లో లేడిగాగా మెత్తటి గులాబీ రంగు ఈకలతో రూపొందించిన డ్రెస్ ధరించింది. దీనిని మోనికా మెర్క్యూరీ రూపొందించారు. లేడీ గాగా, సెలిన్ డియోన్ తో కలిసి డ్యూయెట్ పాటలు పాడారు.. బిజీ జిన్ మైర్ ” మోన్ ట్రూక్ ఆన్ ఫ్లూమ్స్ – మైథింగ్ విత్ ఫెదర్స్” అనే పాటను పాడారు.. ఈ పాట ద్వారా జిన్ మైర్ కు లేడీ గాగా నివాళులు అర్పించిందని ఎన్బిసి న్యూస్ పేర్కొంది..

వాస్తవానికి ప్రారంభ వేడుకలో లేడీగాగా కెనడియన్ ఐకాన్ సెలెన్ డియోన్ తో కలసి ప్రదర్శన ఇస్తుందని ఫ్రెంచ్ మీడియా పేర్కొంది. కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. అయితే అమెరికా దేశాని చెందిన లేడీగాగా కు ఫ్రెంచ్ రాదు.. కానీ ఫ్రెంచ్ తో తనకు ఉన్న అనుబంధాన్ని లేడీ గాగా పంచుకుంది. ” నేను ఫ్రెంచ్ కళాకారిణిని కాదు. ఫ్రెంచ్ ప్రజలతో, ఫ్రెంచ్ సంగీతాన్ని ఆస్వాదించడంలో నేను ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉంటాను. ఫ్రాన్స్ హృదయాన్ని వేడెక్కించే ప్రదర్శనను నేను ఇచ్చానని భావిస్తున్నాను. ఫ్రెంచ్ కళ, సంగీతాన్ని ఆస్వాదించడంలో నేను ముందుంటాను. దాని తప్ప నేను మరొక దానిని కోరుకోవడం లేదు. భూమి మీద ఉన్న అద్భుతమైన నగరాలలో పారిస్ ఒకటని” లేడీ గాగా ట్విట్టర్ ఎక్స్ లో వివరించింది. లేడీ గాగా తల్లి పేరు సింధియా లూయిస్.. తండ్రి పేరు జోసెఫ్ జర్మనోట్టా. సోదరి పేరు నటాలి జర్మనోట్టా. కాగా, లేడీ గాగా తన పాటలతో సంగీత ప్రపంచాన్ని ఓల లాడిస్తోంది . ఇప్పటికే లెక్కకు మిక్కిలి గ్రామీ అవార్డులు సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.