Homeలైఫ్ స్టైల్Life Insurance : ఈ ఒక్క పని చేస్తే.. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.. అదేంటంటే?

Life Insurance : ఈ ఒక్క పని చేస్తే.. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.. అదేంటంటే?

Life Insurance :  జీవితం పూల పాన్పు అని కొందరు అంటారు.. నరకమయం అని మరికొందరు అంటారు.. జీవితం ఎలా ఉన్నా వయసు తీరిన తరువాత అందరూ ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే. అయితే పూర్తి జీవితాన్ని కొనసాగించాలంటే కొన్ని సక్రమమైన పనులు చేయాలి. అప్పడే పూర్తికాలం జీవించగలుగుతారు. కానీ నేటి కాలంలో చాలా మందికి బతుకు మీద భయం పోయింది. దీంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రయానాలు చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ అస్సలు పాటించడం లేదు. రాంగ్ రూట్లో వెళ్లడం.. ట్రిపుల్ రైడింగ్.. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం.. మద్యం తాగి వాహనం నడపడం వంటివి చేస్తున్నారు. వీటిని చేయకూడదని ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయినా కొందరు పట్టించుకోండం లేదు. అయితే ఇలా రూల్స్ పాటించకపోవడం వల్ల కొందరికి సరదా కావొచ్చు.. కానీ ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించాలి. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు నిబంధనలు పాటించనివే ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని అనుకోకుండా జరుగుతున్నాయి. ఏదైనా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి పోయే ప్రాణం ఆగదు అంటారు. సమయం వచ్చినప్పుడు ప్రాణం పోతుంది. కానీ ఆ ప్రాణం ఇంటికి పెద్ద అయితే.. అతనిపై ఎంతో మంది ఆధారపడితే.. ఆప్పుడు పరిస్థితి ఏంటి? ప్రాణం పోయిన వ్యక్తి కంటే తనపై ఆధారపడిన వారి జీవితం నరకమయం అవుతుంది. మరి వారి జీవితం రోడ్డున పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశంలో భారత్ టాప్ లెవల్లో ఉంది. 2022 నివేదిక ప్రకారం దేశంలో 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరగగా..అందులో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో 70 శాతం మంది యువకులే ఉన్నారు. ఈ ప్రమాదాలు ఎక్కువగా సీట్ బెల్ట్ పెట్టుకోకోవడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం, హెల్మెట్ ధరించకపోవడం, మద్యం తాగి నడిపిన వారే ఎక్కువగా ఉన్నారు. ఏమాత్రం జాగ్రత్తగా లేకుండా వాహనాలు నడిపితే విలువైన ప్రాణం పోతుందని ఆ తరువాత గ్రహిస్తారు. ప్రమాదం జరగడం వల్ల వ్యక్తికి మాత్రమే కాదు.. ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబం కూడా తీవ్ర మనోవేదనకు గురవుతుంది. ఒకవేళ ప్రమాదం జరిగి చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి.

మనుషులు ఎప్పుడు? ఏ సమయంలో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే అన్ని సక్రమంగా ఉన్నప్పుడే ఫైనాన్సింగ్ ప్లాన్ చేసకోవాలి. వ్యక్తిపై కుటుంబం ఆధారపడితే ఆ వ్యక్తి లేకున్నా.. కుటుంబ జీవించే మార్గం కోసం చూడాలి. ఇందుకు సరైన మార్గం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. ప్రస్తుత కాలంలో ఇన్సూరెన్స్ హవా సాగుతోంది. ప్రతి ఒక్కరూ ఏదో రకమైన ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల రోడ్డున పడకుండా ఉంటారు. వారి పిల్లల భవిష్యత్ కు ఎలాంటి ఢోకా లేకుండా ఉంటుంది.

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స రకరకాలుగా ఉంటుంది. వ్యక్తుల ఆదాయాన్ని బట్టి రూ. కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దీనిని నెలనెలా కూడా చెల్లించవచ్చు. నెలకు కనీసం రూ.500 నుంచి ప్రారంభమై ఎంతైనా చెల్లించవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ ను ఏజెంట్ల ద్వారానే కాకుండా ఆన్ లైన్ లో కొనుక్కోవచ్చు. ఇందుకు Bankbazar.com లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version