Virat Kohli : విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటర్.. కానీ అతడు ఇండియన్ కాదు.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మొదలుపెట్టారు..

టీమిండియాలో విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాలపు క్రికెట్లో అతడు పరుగుల యంత్రంలాగా ఆడుతున్నాడు. టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించడంలో కీలక భూమిక పోషించాడు. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుపై అతడు ఆడిన ఇన్నింగ్స్ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 10, 2024 10:26 pm

Virat Kohli- Steve Smith

Follow us on

Virat Kohli :  ఈ ఏడాది ఇంగ్లాండ్ జట్టు టెస్టు సిరీస్ కు వ్యక్తిగత కారణాలవల్ల దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్ సిరీస్ కు అందుబాటులోకి వచ్చాడు. అతడిని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సెప్టెంబర్ 12న జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ ద్వారా అతడు మైదానంలోకి అడుగుపెడతాడు. బంగ్లా సిరీస్ అనంతరం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారు జట్టుతో 5 టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ పై ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రత్యేక దృష్టి సారిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతకంటే ముందే విరాట్ కోహ్లీ ప్రస్తావనను ఆస్ట్రేలియా ఆటగాళ్లు తేవడం మొదలుపెట్టారు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాడు. అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ తో తన స్నేహం గురించి ప్రస్తావించాడు..” విరాట్ అద్భుతమైన మనిషి. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అతడు గొప్ప క్రికెటర్. అతనితో నిత్యం నేను టచ్ లోనే ఉంటాను. నాతో చాట్ చేస్తూ ఉంటాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అతడితో పోటీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. అతడు బరిలోకి దిగే విధానం విభిన్నంగా ఉంటుంది. సవాళ్లను అత్యంత సులభంగా స్వీకరిస్తాడు. ప్రత్యర్థి ఆటగాళ్లపై పై చేయి సాధించడానికి వీరోచిత పోరాటం చేస్తుంటాడు. అది నాకు ఒక ఆస్ట్రేలియన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అతడు భారత జట్టులో ఉన్న ఆస్ట్రేలియన్ అనడంలో ఎటువంటి సందేహం లేదని” స్మిత్ వ్యాఖ్యానించాడు.

సోషల్ మీడియాలో సంచలనం..

స్మిత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు సాధారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కవ్వింపు మాటలకు పాల్పడుతుంటారు. టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొడుతుంటారు. అయితే గతానికంటే భిన్నంగా స్మిత్ టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై పాజిటివ్ వ్యాఖ్యలు చేయడం విశేషం. అయితే గత రెండు సీజన్లలో ఆస్ట్రేలియా భారత్ చేతిలో ఓడిపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దక్కించుకోలేకపోయింది. అయితే ఈసారి ఎలాగైనా ట్రోఫీని పొందాలని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది. గత ఏడాది జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ డబ్ల్యూటీసీలో భాగంగా జరుగుతోంది.. ఈ నేపథ్యంలో ఈ సిరీస్లో ఎలాగైనా గెలవాలని భారత్ భావిస్తోంది. గత రికార్డును పదిలం చేసుకోవాలని యోచిస్తోంది. అంతేకాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ వెళ్లి.. టెస్ట్ గదను దక్కించుకోవాలని బలంగా కోరుకుంటున్నది. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ జాబితాలో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. రెండవ స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. మూడో స్థానంలో న్యూజిలాండ్ ఉంది..