Homeక్రీడలుక్రికెట్‌SRH vs DC Match Weather: హైదరాబాదులో దట్టంగా మేఘాలు.. చినుకులు కూడా.. సన్ రైజర్స్,...

SRH vs DC Match Weather: హైదరాబాదులో దట్టంగా మేఘాలు.. చినుకులు కూడా.. సన్ రైజర్స్, ఢిల్లీ మ్యాచ్ జరుగుతుందా..

SRH vs DC Match Weather: సాధారణంగా ఏప్రిల్ నెలలో ఎండలు దంచి కొడతాయి. నిన్నటిదాకా తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 40 కి డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు అన్ని ప్రాంతాలలో నమోదయ్యాయి. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలలో అయితే ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దట్టంగా మేఘాలు ఆవరించాయి. కొన్ని ప్రాంతాలలో చినుకులు కూడా పడ్డాయి. సూర్యుడి వేడి నుంచి కొంతలో ప్రజలకు ఉపశమనం లభించింది.

ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. ఈసారి మాత్రం ఊహించని విధంగా మేఘాలు అలముకుంటున్నాయి. చినుకులు కూడా పడుతున్నాయి. దీంతో వాతావరణంలో అనూహ్య మార్పులు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. హైదరాబాదులో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో మంగళవారం సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే అభిమానులు వేలాది రూపాయలు ఖర్చుపెట్టి టికెట్లు కొనుగోలు చేశారు. మ్యాచ్ ప్రారంభం కావడానికి అంటే ముందే మైదానంలోకి అడుగుపెట్టారు. ఇటీవల హైదరాబాద్ జట్టు ఉప్పల్ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్లో గెలిచింది. అంతకుముందు రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అభిమానులు పాజిటివ్ ఎనర్జీతో ఉన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీతో జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుంది. నెట్ రన్ రేట్ మరింత మెరుగుగా కొనసాగిస్తే హైదరాబాద్ జట్టుకు తిరుగుండదు. అవసరమైతే మూడో స్థానాన్ని ఆక్రమించే అవకాశం కూడా ఉంటుంది.

వాతావరణంలో మార్పులు ఏర్పడిన నేపథ్యంలో.. వాతావరణ శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. హైదరాబాదులో వాతావరణం చల్లగా ఉంటుందని.. మేఘాలు దట్టంగా ఆవరించి ఉంటాయని.. మ్యాచ్ నిర్వహణకు అడ్డంకి ఏమాత్రం ఏర్పడదని స్పష్టత ఇచ్చారు. కొన్ని ప్రాంతాలలో చినుకులు కురిసే అవకాశం ఉందని.. అయితే ఉప్పల్ ప్రాంతంలో కేవలం ఆకాశం మేఘావృతమై మాత్రమే ఉంటుందని అధికారులు వెల్లడించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు. మైదానంలోకి వచ్చిన అభిమానులు ఆకాశాన్ని చూసి పదేపదే వెదర్ యాప్ ను చెక్ చేయడం కనిపించింది. మరోవైపు అటు ఢిల్లీ ప్లేయర్లు.. ఇటు హైదరాబాద్ ప్లేయర్లు మైదానంలో తీవ్రంగా సాధన చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular