సెకండ్‌ టెస్టుకు భారీ మార్పులే చేశారుగా..!

ఫస్ట్‌ టెస్టులో ఘోరంగా దెబ్బతిన్న ఇండియా.. ఇప్పుడు సెకండ్‌ టెస్టు కోసం రెడీ అయిపోయింది. ఇప్పటికే అడిలైట్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టు ఓటమిని.. చెత్త రికార్డును మరోసారి రిపీట్‌ చేయకుండా జాగ్రత్త పడుతోంది. టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఫస్ట్‌ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో చెత్తగా ఆడి రికార్డును మూటగట్టుకున్నారు. ఆ చేదు అనుభ‌వం నుంచి టీమిండియా వేగంగా బ‌య‌ట‌ప‌డ‌క తప్పని ప‌రిస్థితి. Also Read: ఆస్ట్రేలియాతో 2వ టెస్టు: జట్టులోకి ‘ఆ నలుగురు’ క్రిస్మస్‌ మ‌రుస‌టి రోజు […]

Written By: Srinivas, Updated On : December 24, 2020 2:14 pm
Follow us on


ఫస్ట్‌ టెస్టులో ఘోరంగా దెబ్బతిన్న ఇండియా.. ఇప్పుడు సెకండ్‌ టెస్టు కోసం రెడీ అయిపోయింది. ఇప్పటికే అడిలైట్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టు ఓటమిని.. చెత్త రికార్డును మరోసారి రిపీట్‌ చేయకుండా జాగ్రత్త పడుతోంది. టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఫస్ట్‌ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో చెత్తగా ఆడి రికార్డును మూటగట్టుకున్నారు. ఆ చేదు అనుభ‌వం నుంచి టీమిండియా వేగంగా బ‌య‌ట‌ప‌డ‌క తప్పని ప‌రిస్థితి.

Also Read: ఆస్ట్రేలియాతో 2వ టెస్టు: జట్టులోకి ‘ఆ నలుగురు’

క్రిస్మస్‌ మ‌రుస‌టి రోజు టెస్టుకు టీమిండియా రెడీ అవుతోంది. తొలి ఫస్ట్‌ మ్యాచ్‌లో ఓటమితో భారత జట్టుపై ప్రేక్షకుల నుంచి చాలా విమర్శలు వచ్చాయి. ఐపీఎల్‌లో రాణించిన ఎంతోమంది ఉత్తమ బ్యాట్స్‌మెన్లు ఉండగా.. చెత్త చెత్తగా కూర్పు చేశారని ఫైర్‌‌ అయ్యారు. అందుకే.. ఈసెకండ్‌ టెస్టుకు చాలా మార్పులు అనివార్యం అయ్యాయి.

ప్రత్యేకించి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ త‌దుప‌రి టెస్టుల‌కు దూరం అయ్యాడు. భార్య డెలివరీ నేపథ్యంలో కోహ్లీ ఇండియాకు తిరుగుముఖం ప‌ట్టిన నేప‌థ్యంలో రెండో టెస్టు నుంచి త‌దుప‌రి మ్యాచ్ ల‌కు ర‌హానే కెప్టెన్‌గా వ్యవ‌హ‌రించ‌నున్నాడు. ఇక కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్ ఫైన‌ల్ ఎలెవ‌న్ లో చోటు సంపాదించుకోనున్నాడు.

Also Read: చేతులెత్తేసిన టీమిండియా..: మొదటి టెస్టులో ఓటమి

రాహుల్‌ ఇప్పటికే వ‌న్డే సీరిస్, టీ20ల్లో మంచి ఫామ్ ను క‌న‌బ‌రిచాడు. ఇప్పుడు టెస్టు జ‌ట్టులో జ‌ట్టుకు గొప్ప ప్రత్యామ్నాయాలు కూడా లేని నేప‌థ్యంలో రాహుల్ కు అవ‌కాశం ల‌భించ‌డం లాంఛ‌న‌మే. ఇక తొలి టెస్టులో దారుణంగా విఫ‌లమైన పృథ్వీ షా పై వేటు త‌ప్పేలా లేదు. రెండో టెస్టుకు షా స్థానంలో శుభ‌మ‌న్ గిల్ ఎంపిక‌య్యే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. ఇక కీప‌ర్ సాహాపై కూడా వేటు త‌ప్పేలా లేదు. సాహా స్థానంలో రెండో టెస్టులో పంత్‌కు అవ‌కాశం ల‌భించే అవ‌కాశాలున్నాయి. గాయంతో ష‌మీ దూరం కావ‌డంతో.. అత‌డి స్థానంలో మ‌మ్మద్ సిరాజ్‌కు అవ‌కాశం ల‌భించ‌నుంద‌ని తెలుస్తోంది.