https://oktelugu.com/

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఈ సంవత్సరం పాఠశాలలు లేనట్లే..?

దేశంలో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి ప్రభావం విద్యారంగంపై తీవ్రంగా పడిన సంగతి తెలిసిందే. 2020 – 2021 విద్యాసంవత్సరం పూర్తవడానికి మరో మూడున్నర నెలల సమయం మాత్రమే ఉంది. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతున్న తరుణంలో కరోనా కొత్తరకం స్ట్రెయిన్ గురించి వినిపిస్తున్న వార్తలు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ గురించి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. Also Read: విద్యార్థులకు డీఆర్‌డీవో శుభవార్త.. ప్రతి నెలా 15 వేలు పొందే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 24, 2020 / 02:06 PM IST
    Follow us on


    దేశంలో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి ప్రభావం విద్యారంగంపై తీవ్రంగా పడిన సంగతి తెలిసిందే. 2020 – 2021 విద్యాసంవత్సరం పూర్తవడానికి మరో మూడున్నర నెలల సమయం మాత్రమే ఉంది. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతున్న తరుణంలో కరోనా కొత్తరకం స్ట్రెయిన్ గురించి వినిపిస్తున్న వార్తలు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ గురించి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

    Also Read: విద్యార్థులకు డీఆర్‌డీవో శుభవార్త.. ప్రతి నెలా 15 వేలు పొందే ఛాన్స్..?

    రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం తరగతులు నిర్వహించరని ప్రాథమికంగా తెలుస్తోంది. నేరుగా విద్యార్థులను ప్రమోట్ చేయాలని తెలంగాణ విద్యాశాఖ భావిస్తోందని సమాచారం అందుతోంది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో సైతం ఈ నిర్ణయం అమలు కానుందని సమాచారం.

    Also Read: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రిపుల్ ఐటీ మెరిట్ జాబితా ఎప్పుడంటే..?

    స్కూళ్లు తెరిస్తే విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుందని తెలంగాణ సర్కార్, విద్యాశాఖ భావిస్తున్నాయి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కరోనా కేసులు, మరణాలు, వైరస్ వ్యాప్తిని బట్టి తరగతుల నిర్వహణ జరగనుందని తెలుస్తోంది. 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు నుంచి నాలుగు నెలల తరగతుల నిర్వహణ ఉండాలని విద్యాశాఖ భావిస్తోంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    తల్లిదండ్రులు సైతం పిల్లలను పాఠశాలలకు పంపడానికి ఆసక్తి చూపడం లేదు. పిల్లలకు కరోనా నిబంధనలు, భౌతిక దూరం గురించి వివరించినా వాళ్లు అర్థం చేసుకునే అవకాశాలు తక్కువ. తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.