https://oktelugu.com/

Odi World Cup 2023: ప్రపంచ కప్ తర్వాత ఇండియన్ టీమ్ లో భారీ మార్పులు…ఫ్యూచర్ కెప్టెన్ గా మారనున్న నయా ప్లేయర్…

ఈ క్రమంలో ఆస్ట్రేలియా టూర్ కి వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్ గా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇండియన్ టీమ్ తో కోచ్ గా బాధ్యతలను పూర్తి చేసుకోబోతున్న రాహుల్ ద్రావిడ్ తర్వాత కూడా ఆయనే ఇండియన్ టీం కోచ్ గా కూడా కొనసాగుతాడా లేదా అనేది చూడాలి.

Written By:
  • Gopi
  • , Updated On : October 27, 2023 / 01:46 PM IST

    Odi World Cup 2023

    Follow us on

    Odi World Cup 2023: ప్రస్తుతం టీమిండియా వరల్డ్ కప్ లో తనదైన ఒక అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఇలాంటి క్రమంలో టీమిండియా ఆడుతున్న ప్రతి మ్యాచ్ లో ఒక అద్భుతమైన రికార్డ్ ను క్రియేట్ చేస్తుంది. ఇక ఇప్పటికే సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఇండియన్ టీం కప్పు కొట్టడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుంది.

    ఈ క్రమంలో నవంబర్ 19న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ముగుస్తున్న క్రమంలో నవంబర్ 23వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో 5 టి20 మ్యాచ్ లతో కూడా సిరీస్ లను ఆడబోతుంది.ఇక ఇందులో భాగంగానే ప్రపంచ కప్ లో ఆడుతున్న ఇండియన్ ప్లేయర్లకి రెస్ట్ ఇచ్చి యంగ్ ప్లేయర్లతో ఈ సీరీస్ ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.అందులో భాగంగానే ప్రపంచ కప్ లో ఆడుతున్న చాలామంది ప్లేయర్లకు రెస్టు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయంలో ప్లేయర్లనే కాకుండా, రాహుల్ ద్రావిడ్ కి కూడా ఈ తర్వాత రెస్ట్ ఇవ్వబోతున్నట్టుగా ఇప్పటికే చాలా రకాల వార్తలు వస్తున్నాయి. నిజానికి ద్రావిడ్ కుదుర్చుకున్న ఒప్పందం ఈ వరల్డ్ కప్ సీజన్ ముగియడంతో ఆయన ఒప్పందం కూడా పూర్తవుతుంది.

    ఇక ఈ క్రమంలో ఆస్ట్రేలియా టూర్ కి వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్ గా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇండియన్ టీమ్ తో కోచ్ గా బాధ్యతలను పూర్తి చేసుకోబోతున్న రాహుల్ ద్రావిడ్ తర్వాత కూడా ఆయనే ఇండియన్ టీం కోచ్ గా కూడా కొనసాగుతాడా లేదా అనేది చూడాలి. వివిఎస్ లక్ష్మణ్ ఇండియన్ టీం కి ఫుల్ టైం కోచ్ గా మారతాడా లేదా అనేది ఇంకా తెలియదు కాబట్టి రాహుల్ ద్రావిడ్ కనక మళ్లీ ఇండియన్ టీమ్ కోచ్ గా కొనసాగాలంటే మాత్రం ఆయన మళ్లీ తను కోచ్ గా చేయబోతున్నట్టుగా తన ధరఖాస్తు పత్రాన్ని బిసిసిఐ కి అందజేయాల్సి ఉంటుంది.

    ఇలాంటి క్రమంలోనే ఆయన టీమ్ ఇండియాకి కోచ్ గా కొనసాగుతాడా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.అయితే ఈ ఆస్ట్రేలియా మీద ఆడే మ్యాచ్ లో సీనియర్ ప్లేయర్లందరికీ రెస్ట్ ఇచ్చి సూర్య కుమార్ యాదవ్ ని కెప్టెన్ గా చేయనున్నట్టు గా తెలుస్తుంది.

    అయితే 2024 లో టి 20 వరల్డ్ కప్ ఉండడంతో ఇండియా టీం కి ఆ వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయిన మొదటి సీజన్ లో మాత్రమే వచ్చింది. ఇక అప్పట్నుంచి ఇప్పటివరకు ఇండియాకి మళ్ళీ టి20 వరల్డ్ కప్ అనేది రాలేదు. దాంతో ఈసారి ఎలాగైనా ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ కొట్టాలనే దిశగా ఇండియన్ టీమ్ అడుగులు అయితే వేస్తుంది. ఇక ఇంతకుముందు వన్డే టీమ్ ని వరల్డ్ కప్ కి ముందు ఎలాగైతే స్ట్రాంగ్ టీమ్ గా చేశారో ఇప్పుడు కూడా టి 20 ల్లో ఇండియా ని స్ట్రాంగ్ టీమ్ చేస్తున్నారు…