Nagarjuna: హీరోయిన్ కు హగ్, కిస్ ఇచ్చి అడ్డంగా దొరికిన నాగార్జున.. బుక్కయ్యాడిలా

బిగ్ బాస్ లోకి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చే క్రమంలో మన్మథుడు కో డైరెక్టర్ కు ముద్దు పెట్టి వైరల్ అయ్యారు. దీని వల్ల కాస్త రిమార్క్ వచ్చినా కూడా రీసెంట్ గా మళ్లీ యంగ్ హీరోయిన్ కు హగ్, కిస్ ఇచ్చి వార్తల్లో నిలుస్తున్నారు నాగార్జున.

Written By: Suresh, Updated On : October 27, 2023 1:42 pm

Nagarjuna

Follow us on

Nagarjuna: అక్కినేని నట వారసత్వాన్ని కాపాడుతూ తన వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాగార్జున. ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని చాటుకున్నారు. గతంలో స్టార్ హీరోల లిస్ట్ లో చేరిన ఈ హీరో.. సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా విజయవంతంగా కొనసాగిస్తున్నారు. నాగార్జునతో పాటు ఇతర స్టార్లు కూడా కొందరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు చేశారు. కానీ అందరికంటే గ్రేట్ పొజిషన్ లోనే ఉన్నారు ఈ హీరో. ఇదిలా ఉంటే ఈ కాలం కుర్రహీరోలు ముద్దులు హగ్గు లతో ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు.

వారికి పోటీ ఇవ్వడానికి కావచ్చు కొందరు స్టార్ హీరోలు కూడా ముద్దులు, హగ్ లతో అలరిస్తున్నారు. దీంతో వీరు ట్రోల్ కి గురవుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి వార్తల్లో నిలిచారు మన స్టార్ హీరో అక్కినేని నాగార్జున. టాలీవుడ్ మన్మథుడిగా పేరు సంపాదించిన నాగార్జున ఇప్పుడు కూడా కుర్ర హీరోలానే నటిస్తున్నారని కొందరి వాదన. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ 7కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా శనివారం, ఆదివారం వచ్చే ఈ ఎపిసోడ్‌ల‌కు నాగార్జున ఎంట్రీ సాంగ్ తో షో లోకి ఎంటర్ అవుతారు.

అలా బిగ్ బాస్ లోకి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చే క్రమంలో మన్మథుడు కో డైరెక్టర్ కు ముద్దు పెట్టి వైరల్ అయ్యారు. దీని వల్ల కాస్త రిమార్క్ వచ్చినా కూడా రీసెంట్ గా మళ్లీ యంగ్ హీరోయిన్ కు హగ్, కిస్ ఇచ్చి వార్తల్లో నిలుస్తున్నారు నాగార్జున. అయితే దసరా నవరాత్రుల సందర్భంగా కళ్యాణ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు ఈ హీరో.అక్కడికి బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కూడా వచ్చారు. ఆమెను రిసీవ్ చేసుకునే క్రమంలో హగ్ ఇచ్చి, ముద్దు కూడా పెట్టారు నాగ్. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ వయసులో ఇదేం పని అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి.