Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటి వరకు ఇండియా 6 మ్యాచులు ఆడితే అందులో వరుసగా ఆరు విజయాలను అందుకుని సెమీస్ రేస్ లో అందరి కంటే ముందంజలో కొనసాగుతుంది.ఇక ఈరోజు ఇండియా శ్రీలంక మధ్య జరగనున్న మ్యాచ్ లో ఇండియా విజయం తధ్యం గా కనిపిస్తుంది. ఎందుకంటే వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న ఇండియన్ టీమ్ శ్రీలంక జట్టుని కూడా చిత్తు చేయడానికి రెఢీ అయింది…ఇక ఇదే క్రమంలో ఇండియన్ టీం లో కొన్ని భారీ మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే ఈ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో అడుతుండటం వల్ల ఈ పిచ్ బ్యాట్స్ మెన్స్ కి బాగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇండియన్ టీమ్ లో ఎక్కువమంది బ్యాట్స్ మెన్స్ ఉండే విధంగా రోహిత్ శర్మ తనదైన రీతిలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ టీం ని సెలెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఈ పిచ్ ఇప్పుడు కూడా బ్యాట్స్ మెన్స్ కి అనుకూలంగా ఉండటమే కాకుండా చాలా మంది ప్లేయర్లు ఇక్కడ చాలా రికార్డులను కూడా క్రియేట్ చేశారు. ఈ వరల్డ్ కప్ లో కూడా ఈ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే సౌతాఫ్రికా ఇప్పటివరకు ఈ పిచ్ లో రెండు మ్యాచ్ లు ఆడితే ఆ రెండు మ్యాచ్ ల్లోనూ సౌతాఫ్రికా వరుసగా 399,382 పరుగులు చేసి తనదైన గుర్తింపు ను సాధించింది. ఇక ఇవాళ్ళ జరిగే మ్యాచ్ లో కూడా రెండు టీమ్ లు పరుగుల వరద పారించడం మాత్రం పక్క అనీ తెలుస్తుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ కూడా 300 ప్లస్ పరుగులు చేస్తాయని తెలుస్తుంది.
ఇక ఈ పిచ్ బ్యాట్స్ మెన్స్ కి అనుకూలించడంతో పాటుగా కొద్ది ఓవర్లు గడిచిన తర్వాత స్పిన్నర్లకు కూడా కొంత మేరకు అనుకూలిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే రోహిత్ శర్మ అవి ఏంటి అంటే గాయం కారణంగా హార్దిక్ పాండ్యా గత రెండు మ్యాచ్ లకు దూరమైన విషయం మనకు తెలిసిందే ఈ మ్యాచ్ లో కూడా అందుబాటులో ఉండకపోవడంతో ఇతని ప్లేస్ లో ఇంతకుముందు తీసుకున్న సూర్య కుమార్ యాదవ్ ని ఈ మ్యాచ్ లో కూడా తీసుకోవాలని చూస్తున్నారు. ఈ టోర్నీలో ఏ మాత్రం శ్రేయాస్ అయ్యర్ ఏ మాత్రం తన ప్రతిభ ను చూపించలేకపోతున్నాడు కాబట్టి ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ని పక్కన పెట్టి ఆయన ప్లేస్ లో ఇషాన్ కిషన్ ని తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక అనుకోకుండా టీమ్ లోకి వచ్చిన షమీ అద్భుతమైన పర్ఫామెన్స్ చేస్తున్నాడు. కాబట్టి అతన్ని టీమ్ లోనే ఉంచి సిరాజ్ ని టీమ్ నుంచి తీసేయాలని చూస్తున్నారు. ఇక ఇండియన్ టీమ్ ఇప్పుడు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనున్నట్టు గా తెలుస్తుంది. సిరాజ్ ప్లేస్ లో శార్దూల్ ఠాకూర్ ని రంగం లోకి దించనున్నట్టు గా తెలుస్తుంది.ఎందుకంటే ఇంగ్లాండ్ మీద ఆడిన మ్యాచులో ఇండియా తక్కువ స్కోరుకే పరిమితం అవ్వాల్సి వచ్చింది.ఇక ఇలాంటి క్రమంలో 8 పొజిషన్ లో వచ్చే ప్లేయర్ కూడా బ్యాట్స్ మెన్ అయి ఉండాలనే విధంగా ఇండియన్ టీం కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కోచ్ రాహుల్ ద్రావిడ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే శార్ధుల్ ఠాకూర్ ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…