https://oktelugu.com/

Photo Story: ఈ ఫొటోలోని బేబీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే?

కిక్, పోకిరి వంటి సినిమాలు సక్సెస్ కావడానికి హీరోది ఎంత పాత్ర ఉందో.. హీరోయిన్ ఇలియాన కూడా అంతే ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ సినిమాల్లో అమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కొన్ని సంవత్సరాల పాటు ఇలియానా బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా కొనసాగింది.

Written By:
  • Srinivas
  • , Updated On : November 2, 2023 / 11:16 AM IST
    Follow us on

    Photo Story: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్నటి వరకు అలరించిన ముద్దుగుమ్మలు ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. సినిమాలకు దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు సినిమాల్లో ఉన్నంతకాలం స్టార్లుగా కొనసాగిన వాళ్లు ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ తో ఆనందంగా ఉన్నారు. మరికొందరు మాత్రం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ భామ ను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఓ బ్లాక్ బస్టర్ మూవీలో ఆమె అలరించిన తరువాత డైరెక్టర్ల ఆమెతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారు. అలా కొన్ని సినిమాల్లో నటించి తన పర్ఫామెన్స్ తో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలరిస్తున్న ఈ భామకు సంబంధించిన చైల్డ్ పిక్ ఒకటి అలరిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరంటే?

    కిక్, పోకిరి వంటి సినిమాలు సక్సెస్ కావడానికి హీరోది ఎంత పాత్ర ఉందో.. హీరోయిన్ ఇలియాన కూడా అంతే ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ సినిమాల్లో అమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కొన్ని సంవత్సరాల పాటు ఇలియానా బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే ఇలియాన ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియా ద్వారా తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ చిన్న నాటి పిక్ అలరిస్తోంది.

    గోవాకు చెందిన ఇలియాన 1987 నవంబర్ 1న ముంబైలో జన్మించింది. చదువు పూర్తయిన తరువాత సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే బాలీవుడ్ ట్రై చేస్తుండగా.. టాలీవుడ్ లో ‘దేవదాసు’ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఫస్ట్ మూవీ సక్సెస్ అయినా ఇల్లు బేబీ డీ గ్లామర్ గా కనిపించింది. దీంతో ఈ అమ్మడును ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే మహేష్ బాబుతో కలిసి పోకిరి సినిమాలో కనిపించి సందడి చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

    అయితే ఆ తరువాత హిందీలో ‘బర్పీ’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగులో వచ్చిన ఆదరణ హిందీలో రాకపోవడంతో ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఈ క్రమంలో ఆమెకు తెలుగులోనూ అవకాశాలు తగ్గాయి. సినిమాల్లో చేయడం ఆపేశాక ఇలియానా వివిధ ప్రదేశాల్లో ఎంజాయ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆకట్టుకుంది. ఇలియానా గతంలో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాపర్ ఆండ్రూ నీబోస్ తో డేటింగ్ చేసింది. అయితే గత మేలో మైఖేల్ డోలన్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బాబు జన్మించాడు. తన బాబును ఎత్తుకున్న ఫొటోతో ఇలియానా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీతోనే కలిసి ఉంటోంది.