Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టీంల మధ్య ఈరోజు ఒక భారీ మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించి వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకోవాలని చూస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే బంగ్లాదేశ్ టీం కూడా 2007వ సంవత్సరం వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ను ఓడించి వాళ్ల ఆదిపత్యాన్ని నిలుపుకుంది ఇక ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తుంది. అయితే బంగ్లాదేశ్ ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఆడితే అందులో రెండు మ్యాచుల్లో ఓడిపోయి ఒక మ్యాచ్ లో గెలిచింది.
కానీ ఇండియాటీమ్ మాత్రం మూడు మ్యాచ్ లు గెలిచి ఆరు పాయింట్లతో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక ఇంకొక మ్యాచ్ గనక గెలిచినట్టయితే ఇండియా సెమి ఫైనల్ బెర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది. అందుకే బంగ్లాదేశ్ మీద ఆడే మ్యాచ్ లో ఇండియన్ బౌలర్లు విజృంభించి బంగ్లాదేశ్ ప్లేయర్లకి గట్టి గుణపాఠం చెప్పాలని ఒక దృఢ సంకల్పంతో ఉండటమే కాకుండా చాలా ఉత్సాహంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో ఎవరెవరు ఆడుతున్నారు ఈ మ్యాచ్ లో ఇండియా బంగ్లాదేశ్ ను చిత్తు చేస్తుందా లేదా అనేది ఒకసారి తెలుసుకుందాం…
ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ప్లేయర్లు అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు.కాబట్టి బంగ్లాదేశ్ ని ఓడించడం ఇండియా టీం కి పెద్ద మ్యాటర్ కాదు కానీ గడిచిన మ్యాచ్ లు చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక చిన్న దేశం ఇండియా ను ఓడించింది.నెదర్లాండ్ లాంటి మరో చిన్న దేశం సౌతాఫ్రికా ని ఓడించింది. కాబట్టి వరల్డ్ కప్ లో ఏదైనా జరగొచ్చు అందుకే ఈ ప్రాసెస్ లో ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వకుండా టీం గెలవాలనే ఆశయంతో ముందుకు వెళితే చాలా మంచిది అని సీనియర్ క్రికెటర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక మ్యాచ్ లో ఇండియన్ టీం ని గనక ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇండియన్ బ్యాట్స్ మెన్స్ అందరూ కూడా మంచి ఫామ్ లో ఉండి వరుసగా ప్రత్యర్థి జట్ల మీద విరుచుకు పడిపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే మన బౌలర్లు అయిన జస్ప్రిత్ బూమ్రా, మహమ్మద్ సిరాజ్ లాంటి ప్లేయర్లు అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తున్నారు.టీమ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఆల్ రౌండర్ గా ఉన్న శార్దూల్ ఠాకుర్ ని తీసివేసి ఆయన ప్లేస్ లో మహమ్మద్ షమీని పెడితే టీము పేస్ బౌలింగ్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్ గా అవుతుంది…ఇక ఆల్రెడీ స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, కుల్దిప్ యాదవ్ లాంటి ప్లేయర్లు ఉన్నారు…
ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ ప్లేయింగ్ లెవన్ ని కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ ఉన్నారు. అలాగే నెంబర్ 3 లో విరాట్ కోహ్లీ,నెంబర్ 4 లో శ్రేయాస్ అయ్యర్ , నెంబర్ 5 లో కేఎల్ రాహుల్, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా,నెంబర్ 8 కుల్దీప్ యాదవ్, నెంబర్ 9 లో మహమ్మద్ షమీ లేదా శార్దుల్ ఠాకూర్ లో ఎవరో ఒకరు ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నెంబర్ 10 లో జస్ప్రత్ బుమ్రా, నెంబర్ 11 లెవన్ లో మహమ్మద్ సిరాజ్ లు ఉన్నారు…
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్ టీమ్ లో ఇద్దరు, ముగ్గురి ని మినహా ఇస్తే అంత పెద్ద ప్లేయర్లు ఎవరు లేరు మొదట గా పవర్ ప్లే లో కొన్ని వికెట్లు తీస్తే బంగ్లాదేశ్ టీమ్ మిడి లార్డర్ లో ఆంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరు లేరు కాబట్టి వాళ్ళని భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయవచ్చు