SRH vs Punjab: ఐపీఎల్ లో పరుగుల కంటే.. వికెట్ల కంటే.. ఫీల్డింగ్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఫీల్డర్లు చేసిన ఫీల్డింగ్ ఆధారంగానే జట్టు విజయాలు ఆధారపడి ఉంటాయి. అందువల్లే ఐపిఎల్ లో అన్ని జట్లు ఫీల్డింగ్ కు అత్యంత ప్రాధాన్యమిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ఫీల్డింగ్ కోచ్ లను నియమిస్తాయి.
ఐపీఎల్ లో మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఒక మిస్ ఫీల్డ్ చోటు చేసుకుంటే.. ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అది మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటుంది. అందువల్లే మ్యాచ్ జరుగుతున్నంత సేపు జట్ల కెప్టెన్లు సమర్థవంతమైన ప్లేయర్లను మైదానంలో ఉంచుకుంటారు. పాదరసం లాగా కదిలే ఆటగాళ్లకు ఫీల్డింగ్ బాధ్యతలు అప్పగిస్తారు. ఒక క్యాచ్ మిస్ అయినా.. ఒక రన్ అవుట్ మిస్ అయినా.. పరిస్థితి ఎలా ఉంటుందో కెప్టెన్ కు తెలుసు.
ప్రస్తుత ఐపీఎల్లో అత్యంత చెత్త ఫీల్డింగ్ చేస్తున్న జట్టు ఏదైనా ఉందంటే అది పంజాబ్ మాత్రమే. ఇప్పటివరకు పంజాబ్ ప్లేయర్లు 17 క్యాచ్ లను నేలపాలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ జట్టుతో బుధవారం జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ ప్లేయర్లు కూపర్ కనౌలి , ఫెర్గు సన్, శశాంక్ సింగ్ తలా ఒక క్యాచ్ మిస్ చేశారు. ఇవన్నీ కూడా ఎంతో విలువైనవిగా మారిపోయాయి. వచ్చిన అవకాశాలను వినియోగించుకున్న హైదరాబాద్ ప్లేయర్లు క్లాసెన్, ఇషాన్ కిషన్ అదరగొట్టారు. పంజాబ్ బౌలర్లను పూర్తిగా బెదరగొట్టారు. ఫలితంగా హైదరాబాద్ స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఓవర్ కు 12 కు మించిన రన్ రేట్ తో పరుగులు తీస్తోంది.
ఐపీఎల్ లో అత్యంత చెత్త ఫీల్డింగ్ జట్లలో పంజాబ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే పంజాబ్ జట్టుకు మిగతా ప్లేయర్లు బీభత్సంగా పరుగులు జత చేస్తున్న నేపథ్యంలో ఫీల్డింగ్ లోపం అంతగా కనిపించడం లేదు. హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో మాత్రం పంజాబ్ ఫీల్డింగ్ లోపం స్పష్టంగా కనిపించింది..
ఇదే విషయాన్ని పంజాబ్ జట్టు కోచ్ రికీ పాంటింగ్ ఎదుట ప్రస్తావిస్తే.. ఆయన కూడా జట్టు ఆటగాళ్ల తీరు పట్ల నిర్వేదం వ్యక్తం చేశాడు. ఇటువంటి ఆట తీరు ఏమాత్రం సరికాదని వాపోయాడు.. ఇప్పటికైనా ఆటగాళ్లు ఫీల్డింగ్ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. దీనిపై పరిశీలన చేసుకుంటామని.. మరోసారి ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని పాంటింగ్ స్పష్టం చేశాడు.
What’s happening out there?
Cooper Connolly, Shashank Singh and Lockie Ferguson drop crucial chances
How costly will these be?
Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS pic.twitter.com/dgru0kHkir
— IndianPremierLeague (@IPL) May 6, 2026