Divyendu Likes in Peddi Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram charan) ప్రస్తుతం బుచ్చి బాబు(Buchi Babu Sana) దర్శకత్వం లో ‘పెద్ది'(Peddi Movie) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ‘గేమ్ చేంజర్’ చిత్రం పరాజయంతో డీలాపడిన మెగా అభిమానుల్లో సరికొత్త నూతనోత్సహం నింపింది ‘పెద్ది’ గ్లింప్స్ వీడియో. ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో వచ్చే సిగ్నేచర్ షాట్ ని IPL సీజన్ లో ప్రముఖ టీమ్స్ అన్నీ ఏ రేంజ్ లో సోషల్ మీడియా లో వాడుకున్నాయో మనమంతా చూసాము. పుష్ప చిత్రం లోని అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ఆ సినిమా విడుదలయ్యాక నేషనల్ లెవెల్ లో పాపులర్ అయ్యాయి. కానీ ‘పెద్ది’ కేవలం గ్లింప్స్ వీడియో తోనే నేషనల్ లెవెల్ లో ప్రకంపనలు పుట్టించాడు. ఇక భవిష్యత్తులో ఆయన ఈ సినిమాతో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
ఇకపోతే ఈ చిత్రంలో ‘మీర్జా పూర్’ వెబ్ సిరీస్ లో మున్నా అనే క్యారక్టర్ తో యూత్ ఆడియన్స్ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న దివ్యేందు శర్మ(Divyendu Likes) కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన ‘పెద్ది’ మూవీ లో రామ్ చరణ్ తో కలిసి దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో రామ్ చరణ్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ ‘అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం యాక్షన్ షెడ్యూల్ విరామం లేకుండా కొనసాగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఫోటోలలో రామ్ చరణ్ లుక్స్ ని చూసి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. కొంతమంది అయితే దివ్యేందు శర్మ రామ్ చరణ్ ని డామినేట్ చేస్తున్నాడు అంటూ కూడా కామెంట్స్ చేశారు. ఇలా సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఫొటోలే కనిపిస్తున్నాయి.
Also Read : ‘పెద్ది’ పై రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్..కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!
ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్పీడ్ చూస్తుంటే ఈ ఏడాది అక్టోబర్ లోపు సినిమా రెడీ అయ్యేలా ఉంది. బలంగా తల్చుకుంటే ఈ ఏడాదిలోనే ఈ సినిమాని విడుదల చేయొచ్చు. కానీ రామ్ చరణ్ ఓటీటీ డీల్ నెట్ ఫ్లిక్స్ కి మాత్రమే జరగాలని పట్టుబట్టడం, నెట్ ఫ్లిక్స్ సంస్థకు ఈ ఏడాది స్లాట్స్ మొత్తం ఫుల్ అయిపోవడం తో వచ్చే ఏడాది స్లాట్ లో ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడం వల్ల, వచ్చే ఏడాదికి ఈ సినిమా షిఫ్ట్ అయ్యింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27 న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేయనున్నారు.