IPL Auction 2023 – RCB : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులను సంపాదించుకున్న లీగ్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఐపిఎల్ అనే చెప్పాలి. ఈ ఐపీఎల్ లో ఆడటానికి ప్రపంచంలోని ప్రతి ఒక్క ప్లేయర్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ల దేశం తరఫున సంవత్సరం పాటు ఆడితే వచ్చే డబ్బులు మొత్తం, ఒక రెండు నెలల పాటు ఈ ఒక్క ఐపీఎల్ ఆడితే వస్తుంది. ఇక దాంతో పాటుగా అభిమానుల నుంచి విపరీతమైన క్రేజ్ ను కూడా సంపాదించుకోవచ్చు. అందుకే ఎక్కువమంది ప్లేయర్లు ఐపిఎల్ ఆడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తూ ఉంటారు. ఇక ఈ ఐపిఎల్ ద్వారానే ఇంగ్లాండ్ కి చెందిన మోయిన్ అలీ, సామ్ కరణ్ లాంటివారు అద్భుతమైన పర్ఫామెన్స్ ని కనబరిచి వాళ్ల ఇంటర్నేషనల్ టీం లో చోటు సంపాదించుకున్నారు.
ఇక ఇలా తమదైన రీతిలో ఆట తీరని కనబరుస్తూ డబ్బులు ఎక్కువగా తీసుకుంటూ తమ దేశం తరఫున ఆడే మ్యాచ్ లకు అవకాశాలను కూడా సంపాదించుకుంటున్నారు కాబట్టి ఐపిఎల్ అన్నది ప్రతి ఒక్క ప్లేయర్ కి చాలా స్పెషల్ గా మారింది.ఇక ఈ క్రమంలోనే ఐపిఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం కప్పు కొడుతుంది అనే ఒక కాన్ఫిడెంట్ తో ప్రతి ప్రేక్షకులు కూడా విరాట్ కోహ్లీ మీద ఉన్న అభిమానంతో బెంగుళూర్ టీమ్ ను అభిమానిస్తు వస్తున్నారు. కానీ వీళ్లు మాత్రం ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణం చేత సెమిస్ కి గానీ ఫైనల్స్ కి గానీ వచ్చి గెలవలేక టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నారు.
ఇక ఈసారి మాత్రం పక్క కప్పు కొడతాం అనే ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పటికే వీళ్ళ టీంలోకి ఆస్ట్రేలియా టీం కి చెందిన కెమరూన్ గ్రీన్ లాంటి ప్లేయర్లు రావడం వీళ్ళకి మరింత బలాన్ని చేకూర్చింది. అలాగే ఇక మిడిల్ ఆర్డర్ లో కెమెరాన్ గ్రీన్ ఆడిచ్చిన లేదంటే ఓపెనర్ గా ఆడించిన కూడా తను తన పవర్ఫుల్ హిట్టింగ్ తో టీం కు భారీ స్కోర్ అందించడంలో ఎప్పుడూ ముందుంటాడని బెంగళూరు యాజమాన్యం ఆశ భవాని వ్యక్తం చేస్తుంది. ఇక మిడిల్ ఆర్డర్ లో మాక్స్ వెల్ తన విశ్వరూపం చూపించడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి గ్రీన్, మాక్స్ వెల్ లతో బెంగళూరు టీం అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇవ్వడానికి రెడీ అవుతుంది.
ఇక ఈసారి కప్పు కొట్టడమే దిశగా బెంగుళూర్ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈనెల 19 న జరిగే మినీ ఆక్షన్ లో మరికొంత మంది యంగ్ ప్లేయర్స్ ని తీసుకునే అవకాశం ఉంది. ఇక రాసి పెట్టుకోండి 2024 కప్పు బెంగళూరుదే అనేంత కాన్ఫిడెంట్ గా బెంగళూరు టీమ్ ఐపీఎల్ కప్పు మీద ధీమాను వ్యక్తం చేస్తుంది. చూడాలి మరి ఈసారైనా బెంగుళూర్ కప్పు కొడుతుందా లేదా అనేది…