Heinrich Klaasen: లాగి పెట్టి కొడితే బంతి ఆకాశ వీధిలోకి వెళ్ళింది.. క్లాసెన్ విధ్వంసానికి పరాకాష్ట ఇది..

హెడ్ అవుట్ అయిన తర్వాత.. మరో ఎండ్ లో ఉన్న క్లాసెన్ మరింత రెచ్చిపోయాడు. 31 బాల్స్ లో రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు కొట్టి 67 పరుగులు చేశాడు. దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు గాని.. లేకుంటే హైదరాబాద్ జట్టు స్కోరు 300కు చేరుకునేది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 16, 2024 8:12 am

Heinrich Klaasen

Follow us on

Heinrich Klaasen: విధ్వంసం.. పెను తుఫాను.. మైదానంలో బీభత్సం.. ఇంకా ఎలాంటి ఉపమానాలు ఉంటే అలాంటివి.. ఎందుకంటే హైదరాబాద్ బ్యాటింగ్ అలా సాగింది కాబట్టి. బెంగళూరు జట్టుతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు హెడ్ విధ్వంసం సృష్టిస్తే.. క్లాసెన్ ప్రళయాన్ని ఏర్పరిచాడు. ఫలితంగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న బెంగుళూరు జట్టుకు హైదరాబాద్ ఆటగాళ్లు పీడకలను మిగిల్చారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించారు.. మొన్నటికి మొన్న సొంత మైదానంలో ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో 277 రన్స్ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా హైదరాబాద్ ను నిలబెట్టిన బ్యాటర్లు.. కేవలం రెండు మ్యాచ్ ల వ్యవధిలోనే హైదరాబాద్ జట్టు తన రికార్డు తానే తిరగరాసే విధంగా చేశారు. బెంగళూరు మైదానంపై ఇప్పటివరకు ఉన్న హైయెస్ట్ స్కోర్ రికార్డు 226 పరుగులు కాగా.. దానిని హైదరాబాద్ ఆటగాళ్లు తుడిచిపెట్టారు. ఏకంగా 287 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. హెడ్ 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో తొమ్మిది ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.

హెడ్ అవుట్ అయిన తర్వాత.. మరో ఎండ్ లో ఉన్న క్లాసెన్ మరింత రెచ్చిపోయాడు. 31 బాల్స్ లో రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు కొట్టి 67 పరుగులు చేశాడు. దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు గాని.. లేకుంటే హైదరాబాద్ జట్టు స్కోరు 300కు చేరుకునేది.. ఇప్పుడు మాత్రమే కాదు.. గత ఆరు మ్యాచ్లలోనూ క్లాసెన్ నిలకడగా రాణిస్తున్నాడు. కోల్ కతా జట్టు తో జరిగిన మ్యాచ్ లో 63(29), ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో 80*(34), గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 24(13), చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో 10*(11), పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 9(9), తాజాగా బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో 67(31) పరుగులు చేసి సత్తా చాటాడు.

ముఖ్యంగా సోమవారం రాత్రి బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో హెడ్ తర్వాత క్లాసెన్ వీర విహారం చేశాడు. పెర్గుసన్ బౌలింగ్ లో 16 ఓవర్ లో రెండవ బంతిని భారీ సిక్సర్ గా మలిచాడు. క్లాసెన్ కొట్టిన వేగానికి బంతి 106 మీటర్ల ఎత్తుకు ఎగిరి స్టాండ్స్ అవతల పడింది.. ఈ సీజన్లో ఇదే హైయెస్ట్ సిక్సర్. ఈ మ్యాచ్లో 31 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 67 పరుగులు చేశాడు. భారీ సిక్సర్ కొట్టడంతో హైదరాబాద్ అభిమానులు క్లాసెన్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. గతంలో ఈ మైదానంలో గేల్ ఈ స్థాయిలో సిక్సులు కొట్టాడు. మళ్లీ ఇంత కాలానికి క్లాసెన్ ఆ స్థాయిలో సిక్స్ బాదాడు. బంతిని క్లాసెన్ కొట్టిన కొట్టుడుకు బంతి ఎక్కడో స్టాండ్స్ లో పడింది. ఫలితంగా బంతి వేసిన బౌలర్ పెర్గూసన్ ముఖంలో నెత్తురు చుక్క కూడా లేదు.. క్లాసెన్ బ్యాటింగ్ శైలి చూసి వ్యాఖ్యాతలు కూడా..”బంతి ఎక్కడో ఆకాశవీధిలో చక్కర్లు కొడుతోంది కావచ్చు” అని వ్యాఖ్యానించడం విశేషం.