https://oktelugu.com/

First Six: టెస్ట్ క్రికెట్లో తొలి సిక్స్ కొట్టింది ఇతడే.. నాడు నిబంధనలు ఎలా ఉండేవంటే..

టి20 కాలంలోకి క్రికెట్ ప్రవేశించింది. వేగాన్ని, దూకుడును అందిపుచ్చుకుంటూ సరికొత్త ఆట తీరును అభిమానులకు పరిచయం చేసింది. టి20 వెలుగులోకి వచ్చిన తర్వాత క్రికెట్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇది టెస్ట్ క్రికెట్ కూ పాకింది..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 7, 2024 / 03:09 PM IST

    First Six

    Follow us on

    First Six: వేగంగా పరుగులు సాధించి త్వరగా మ్యాచ్ ముగించేయాలనే విధానం గత కొద్ది సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్లో కనిపిస్తోంది. దీనికి తోడు ఇంగ్లాండ్ లాంటి జట్లు బజ్ బాల్ వంటి క్రికెట్ ను టెస్ట్ ఫార్మాట్ లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో వేగం అనేది టెస్ట్ క్రికెట్ లోనూ కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మ్యాచ్లను చూస్తే డ్రా అవడం పూర్తిగా తగ్గిపోయింది. మూడు లేదా నాలుగు రోజుల్లోనే ఆట ముగియడం సర్వసాధారణంగా మారింది. అరుదుగా మాత్రమే ఐదు రోజులపాటు ఆట కొనసాగుతోంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సరికొత్త సంచలనాలను నమోదు చేస్తున్నాయి. ఇటీవల భారత దేశంలో పర్యటించిన న్యూజిలాండ్ జట్టు.. మూడు టెస్టుల సిరీస్ ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. అంతేకాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు వెళ్లాలనే భారత జట్టు ఆశలను క్లిష్టతరం చేసింది. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు.. బజ్ బాల్ క్రికెట్ ఆడుతోంది. న్యూజిలాండ్ జట్టుపై ఇప్పటికే ఒక టెస్ట్ గెలిచింది. మరో టెస్ట్ కూడా గెలవడానికి రంగం సిద్ధం చేస్తోంది. రెండో టెస్టులో విజయం సాధిస్తే ఇంగ్లాండ్ సిరీస్ సొంతం చేసుకుంటుంది. అయితే ఈ మ్యాచ్లలో ఫోర్ లతోపాటు సిక్సర్ లను కూడా ఆటగాళ్లు సులభంగా కొడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో ఈ తరహా బ్యాటింగ్ విధానం టెస్టు క్రికెట్లో కనిపించకపోయేది. కానీ కొంతకాలంగా మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తోంది.

    తొలి సిక్స్ ఎవరు కొట్టారంటే

    ఇప్పటి క్రికెట్లో ఫోర్లు, సిక్సర్లు కొట్టడం సర్వసాధారణమైపోయింది. క్రికెట్ లోనూ ఈ స్థాయిలో దూకుడు ఆట ప్రదర్శించడం కామన్ అయిపోయింది. అయితే క్రికెట్ మొదలైన తొలి రోజుల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉండేది. 1877లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడాయి. అయితే 21 సంవత్సరాల తర్వాత 1898లో ఆస్ట్రేలియా బ్యాటర్ జో డార్లింగ్ టెస్ట్ క్రికెట్లో తొలి సిక్స్ కొట్టాడు . అంటే టెస్ట్ క్రికెట్ మొదలైన 21 సంవత్సరాల తర్వాత తొలి సిక్స్ నమోదు అయిందంటే నాడు క్రికెట్ స్వరూపం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ రోజుల్లో స్పష్టమైన నిబంధనలు ఉండేవి కాదు. అయితే బంతి అమాంతం గాల్లో లేచి గ్రౌండ్ అవతలపడితేనే సిక్స్ అని నిర్ధారించేవారు. అందువల్ల పెద్దగా సిక్సర్లు నమోదయ్యేవికావు.. బౌండరీ కి మాత్రం ఐదు పరుగులు ఇచ్చేవారు. ఇదే క్రమంలో బౌండరీ లైన్ నిబంధనను పూర్తిగా మార్చేశారు. ఆ తర్వాత ఫోర్ కు నాలుగు పరుగులు.. సిక్సర్ కు ఆరు పరుగులు ఇవ్వాలని నిర్ణయించారు. బంతి గాల్లో లేచి బౌండరీ లైన్లో పడితే సిక్సర్ అని ప్రకటించేవారు. ఇక అప్పట్నుంచి ఇదే నిబంధన కొనసాగుతోంది. టెస్ట్ క్రికెట్లో తొలి సిక్సర్ కొట్టిన రికార్డు మాత్రం జో డార్లింగ్ పేరు మీద ఉంది.