https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : యష్మీ బండారం బయటపెట్టిన నాగార్జున.. పృథ్వీ రాజ్ కి రెడ్ కార్డు వార్నింగ్!

ఇక పృథ్వీ రాజ్ హౌస్ లో కొన్ని సార్లు F అని పదం తో వచ్చే బూతులు వాడుతున్నాడు, దీనిపై నాగార్జున ఫైర్ అవుతాడు, నోరు అదుపులో పెట్టుకో ఇంకోసారి అలా మాట్లాడితే అంటూ రెడ్ కార్డు వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది ఈరోజు ఎపిసోడ్ లో చూద్దాం.

Written By:
  • Vicky
  • , Updated On : September 14, 2024 / 07:49 PM IST

    Yashmi1

    Follow us on

    Bigg Boss Telugu 8 :ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ రకరకాల ఎమోషన్స్ తో ముందుకు సాగిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న గాక మొన్న మొదలైనట్టు అనిపిస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో అప్పుడే రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారం లో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వగా, రెండవ వారం లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే సోషల్ మీడియా లో జరుగుతున్నా పొలింగ్స్ లో ఓటింగ్ సరళి రోజుకి ఒకలాగా మారిపోతుంది. నిన్న మొన్నటి వరకు విష్ణు ప్రియా అందరికంటే టాప్ ఓట్లతో నెంబర్ 1 స్థానం లో కొనసాగితే, ఇప్పుడు ఆమె స్థానంలోకి నిఖిల్ వచ్చి చేరాడు. డేంజర్ జోన్ లో నిన్న మొన్నటి వరకు ఆదిత్య ఓం, సీత కొనసాగితే..ఇప్పుడు శేఖర్ బాషా, పృథ్వీ రాజ్ కొనసాగుతున్నారు. కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చెప్పడం ఈసారికి కష్టమే. రేపటి వరకు వేచి చూడక తప్పదు. ఇదంతా పక్కన పెడితే నేడుజరగబోయే ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ మీద ఉగ్ర రూపం చూపించాడు.

    కాసేపటి క్రితమే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా అది తెగ వైరల్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో నాగార్జున యాష్మీ అరాచకాలకు బ్రేక్ వేసినట్టుగా అనిపించింది. ముందుగా ఆయన అడుగుపెట్టగానే క్లాన్ చీఫ్స్ ని పైకి లేయమంటాడు. మీ క్లాన్ పెర్ఫార్మన్స్ గురించి మీరే మాట్లాడాలి అంటూ నాగార్జున చీఫ్స్ కి ఒక ఛాయస్ ఇస్తాడు. ముందుగా యష్మీ ని చెప్పగమనగా, ఆమె పృథ్వీ రాజ్, అభయ్ ని బాగా ఆడిన వారి లిస్ట్ లోకి చేర్చి, ప్రేరణా ని బాగా ఆడని వారి లిస్ట్ లోకి చేర్చింది. కారణం సంచాలక్ గా వచ్చినప్పుడు ఆమె బాగా కన్ఫ్యూజ్ అయ్యింది అని అంటుంది. అప్పుడు నాగార్జున కన్ఫ్యూజ్ అయ్యిందా, లేదా మీరంతా కలిసి ఆమెని కన్ఫ్యూజ్ చేశారా అని అడుగుతాడు. సంచాలక్ గురించి మాట్లాడుతున్నావ్ కదా, బొరుగుల కొలత టాస్క్ లో నువ్వు సంచాలక్ గా సరైన నిర్ణయం తీసుకున్నావా అని నాగార్జున అడుగుతాడు. అప్పుడు యష్మీ అవును సార్ అని అంటుంది.

    ఇక ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ ‘నువ్వు కంటెస్టెంట్స్ ఇద్దరికీ దగ్గరగా ఉన్న బరువుని లెక్కలోకి తీసుకుంటాను అని చెప్పావా లేదా’ అని అడుగుతాడు. యష్మీ లేదు సార్, నేను అలా చెప్పలేదు అని అంటుంది. అప్పుడు నాగార్జున ఆమె అలా చెప్పిన వీడియో ని ప్లే చేస్తాడు, అడ్డంగా దొరికిపోయేసరికి 5 మంది ఉన్న క్లాన్ ఆకలితో ఉండడం కంటే, ఇద్దరు ఉన్న క్లాన్ ఆకలితో ఉండడం బెటర్ కదా అని అలాంటి నిర్ణయం తీసుకున్నాను అని కవర్ చేసుకుంటూ ఏడుస్తుంది. ఇక పృథ్వీ రాజ్ హౌస్ లో కొన్ని సార్లు F అని పదం తో వచ్చే బూతులు వాడుతున్నాడు, దీనిపై నాగార్జున ఫైర్ అవుతాడు, నోరు అదుపులో పెట్టుకో ఇంకోసారి అలా మాట్లాడితే అంటూ రెడ్ కార్డు వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది ఈరోజు ఎపిసోడ్ లో చూద్దాం.