Hardik Pandya: సోషల్ మీడియాలో ట్రోలింగ్. మీడియాలో విమర్శనాత్మక కథనాలు. ఇక పోస్టింగులు, మీమ్స్ కైతే లెక్కేలేదు.. విడాకులు తీసుకున్నాడని కొంతమంది అంటుంటే.. ఇంకా కొంతమంది 70% భరణం ఇచ్చాడని అంటున్నారు. మరి కొంతమంది అయితే ఆయన భార్య ఆల్రెడీ వేరే అతడితో ఉంటోంది.. దాదాపుగా ఇద్దరు దూరమైనట్టే.. అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ ఆటగాడు ఇంతవరకు స్పందించలేదు. అతని భార్య కూడా నోరు విప్పలేదు. కానీ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మీడియా రోజుకో తీరుగా కథనాలను వండి వార్చుతోంది. ఈ క్రమంలోనే అతడు ప్రత్యక్షమయ్యాడు. అమెరికాలో కనిపించాడు. టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియాతో జాయిన్ అయ్యాడు.. దీంతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ప్రారంభం నుంచే ఏదో ఒక విషయంలో వార్తల్లో వ్యక్తవుతున్నాడు. నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. ముంబై జట్టు కెప్టెన్సీ విషయంలో.. ఆ తర్వాత ముంబై జట్టు దారుణమైన ఆటతీరుతో.. అతడు తీవ్రంగా ఆరోపణలు చవిచూస్తున్నాడు. ఇది జరుగుతుండగానే భార్య నటాషా తో విడాకులు తీసుకుంటున్నాడనే రూమర్స్ చర్చకు దారి తీస్తున్నాయి. ఫలితంగా హార్దిక్ పాండ్యా టి20 వరల్డ్ కప్ లో ఆడబోడని పుకార్లు వినిపించాయి. జరుగుతున్న పరిణామాలు అందుకు బలం చేకూర్చాయి. చివరికి టి20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా లోని సభ్యులు విడతలవారీగా న్యూయార్క్ వెళ్లిపోయారు. అందులో హార్దిక్ పాండ్యా కనిపించలేదు. ఫలితంగా హార్దిక్ పాండ్యా టి20 వరల్డ్ కప్ లో ఆడేది అనుమానమేననే వాదనలకు బలం చేకూరింది. అయితే వాటిని చెక్ పెడుతూ హార్థిక్ పాండ్యా న్యూయార్క్ చేరుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లతో ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు.
జూన్ రెండు నుంచి టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇస్తున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్ జట్టుతో ఆడుతుంది. జూన్ 9న పాకిస్తాన్ జట్టుతో తలపడుతుంది. వీటన్నింటి కంటే ముందు జూన్ 1న న్యూయార్క్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఇక టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ కఠోరంగా సాధన చేస్తున్నారు. ఇందులో హర్దిక్ పాండ్యా కూడా జాయిన్ అయ్యాడు. ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పంచుకున్నాడు.. on national duty in అని క్యాప్షన్ జత చేశాడు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు హార్దిక్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
India begins their practice session in New York. pic.twitter.com/HRxdlnwPBL
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 28, 2024