https://oktelugu.com/

Kavya Maran: కావ్య ప్లానింగ్ మామూలుగా లేదు.. రాసి పెట్టుకోండి.. వచ్చే ఐపీఎల్ కప్ సన్ రైజర్స్ దే..

వచ్చే సీజన్ కు సంబంధించి.. ఈ ఏడాది డిసెంబర్ నుంచి.. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఐపీఎల్ మెగా వేలం జరుగుతుంది. దీనికి హైదరాబాద్ జట్టు సన్నద్ధమవుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 30, 2024 / 11:12 AM IST

    Kavya Maran

    Follow us on

    Kavya Maran: గత సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించిన సన్ రైజర్స్.. ఈసారి మాత్రం మెరుగ్గా ఆడింది. కసికొద్ది బ్యాటింగ్ చేసింది. దురదృష్టం కొద్దీ ఫైనల్ మ్యాచ్లో తేలిపోయింది గాని.. లేకుంటే చరిత్ర సృష్టించేదే. అటువంటి ఆట తీరు ప్రదర్శించింది కాబట్టే.. హైదరాబాద్ జట్టు ఫైనల్ లో ఓడిపోయినప్పటికీ.. కావ్య మారన్ సన్ రైజర్స్ ఆటగాళ్లను అభినందించింది. “మీ ఆట తీరుతో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని” కొనియాడింది.. ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన నేపథ్యంలో.. వచ్చే సీజన్లో కచ్చితంగా కప్ గెలుచుకునే విధంగా కావ్య ప్రణాళికలు రూపొందిస్తోంది. వాస్తవానికి ఈ సీజన్ కు ముందుగానే హసరంగను హైదరాబాద్ జట్టు కోల్పోయింది. అతడు లేని ప్రభావం జట్టు మీద పడకుండా చూసుకుంది. అయితే కొన్ని మ్యాచ్ లలో అతడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. కోల్ కతా తో జరిగిన క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో హసరంగ ఉండి ఉంటే.. పరిస్థితి మరో విధంగా ఉండేది.

    ఈ సీజన్లో హైదరాబాద్ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు..కోల్ కతా జట్టు లాగానే హిట్టింగ్ ను ప్రదర్శించారు.. గత సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించిన హైదరాబాద్.. ఈ సీజన్ లో మాత్రం మెరుగైన ఆట ఆడింది. ఏకంగా ఫైనల్ దాకా వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే టీం తో 2025 ఐపీఎల్ కు వెళ్లాలని కావ్య భావిస్తోంది. దానికంటే ముందు మెగా వేలంలో మళ్లీ ఆమె జట్టును పునర్నిర్మించాల్సి ఉంది. అయితే ఇందుకు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య తక్కువగా ఉంది.. ఒక్కో జట్టుకు ఎనిమిది వరకు రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని బీసీసీఐకి ఫ్రాంచైజీలు విజ్ఞప్తి చేశాయి . దీనికి బోర్డు అంత సుముఖంగా లేదు. వర్గాల సమాచారం ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ రైట్ టు మ్యాచ్(RTM) కార్డుతో పాటు కనీసం నలుగురు ఆటగాళ్లను (ఇద్దరు విదేశీ, ఇద్దరు స్వదేశీ ఆటగాళ్లు) మాత్రమే జట్లు ఉంచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

    వచ్చే సీజన్ కు సంబంధించి.. ఈ ఏడాది డిసెంబర్ నుంచి.. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఐపీఎల్ మెగా వేలం జరుగుతుంది. దీనికి హైదరాబాద్ జట్టు సన్నద్ధమవుతోంది. జట్టును మరింత బలోపేతం చేసే దిశగా కావ్య అడుగులు వేస్తోంది. ఈ సీజన్లో జట్టుకు అద్భుతమైన విక్టరీలు అందించిన కీలక ప్లేయర్లను మళ్లీ మెగా వేలంలో కొనుగోలు చేయాలని ఆమె భావిస్తోంది . ఇదే క్రమంలో రిటైన్ జాబితా ఒకసారి పరిశీలిస్తే.. కావ్య మొదటి ఎంపిక ఓపెనర్ అభిషేక్ శర్మ అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫైనల్ మినహా మిగతా అన్ని ఇన్నింగ్స్ లలో అతడు అద్భుతంగా ఆడాడు. సెకండ్ రిటైన్ ఆటగాడిగా ట్రావిస్ హెడ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో అతడు సునామీ లాంటి ఇన్నింగ్స్ ఆడాడు.. ఇక మిగతా ఇద్దరు రిటైన్ ఆటగాళ్ల జాబితా పరిశీలిస్తే.. అందులో భువనేశ్వర్ కుమార్ ఉండే అవకాశం ఉంది. మిగతా ప్లేయర్లకు సంబంధించి శాబాజ్ అహ్మద్, నితీష్ కుమార్ రెడ్డి, నటరాజను వంటి వారు ఉన్నారు. అయితే కావ్య కచ్చితంగా నితీష్, నటరాజన్ వైపు మొగ్గు చూపించే అవకాశం కనిపిస్తోంది. RTM ద్వారా షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్ ను తిరిగి తీసుకునే వెసలు బాటు ఉందట. మెగా వేలంలోకి కమిన్స్, క్లాసెన్ ను మళ్లీ కొంత తక్కువ ధరకు తీసుకోవాలని కావ్య అనుకుంటున్నది. ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, జాన్సన్ కూడా మెగా వేలంలోకి వస్తారు. మరి వీళ్లను కావ్య తీసుకుంటుందో.. లేకుంటే వదిలిపెడుతుందో చూడాలి. ఒకటి మాత్రం స్పష్టం కావ్య ఒకప్పటి లాగా లేదు. ఆమె అంచనాలు వేరే విధంగా ఉన్నాయి. జట్టును పునర్నిర్మించే ఉద్దేశాలు బలంగా ఉన్నాయి. అంటే వచ్చే సీజన్లో హైదరాబాద్ కప్ కొడుతుందన్న మాట..