Dreams: మీ కలలో ఇవి కనిపించాయా? జాగ్రత్త సుమా.. స్వప్న శాస్త్రం ఏం చెబుతుంది అంటే..

లోతైన జలాశయాలు, తుపానులు కలలో కనిపించడం మంచిది కాదట. దీన్ని దురదృష్టానికి సూచకం అంటారు. ఇవి మెదడు అస్థిరతను తెలియజేస్తాయట. తుపానులు, వరదలు కనిపిస్తే.. కుటుంబంలో కలహాలు జరుగుతాయట.

Written By: Swathi, Updated On : May 28, 2024 2:43 pm

Dreams

Follow us on

Dreams: ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తుంటాం. ఎందరితోనో మాట్లాడుతుంటాం.కొత్త కొత్త వాటిని చూస్తుంటాం. ఇక రాత్రి పడుకున్న తర్వాత మెదడు రెస్ట్ తీసుకోకుండా థింక్ చేస్తుంటుంది కావచ్చు మన నిద్రను డిస్ట్రబ్ చేస్తుంది కదా. అదేనండి కలలు వస్తాయి కదా. కొన్ని కలలు మంచికి అనుకుంటే కొన్ని మాత్రం అశుభం అంటారు పెద్దలు. ఇదెలా ఉంటే కొన్ని రకాల వస్తువులను ఎప్పుడూ చూడకున్నా అవి కలలో కనిపిస్తుంటాయి. ఇలాంటివి కనిపిస్తే అపశకునం అంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం ఓ 5 రకాల వస్తువులు, కొన్ని సంఘటనలు జరగవద్దు అంటారు. అవేంటి అంటే..

లోతైన జలాశయాలు, తుపానులు కలలో కనిపించడం మంచిది కాదట. దీన్ని దురదృష్టానికి సూచకం అంటారు. ఇవి మెదడు అస్థిరతను తెలియజేస్తాయట. తుపానులు, వరదలు కనిపిస్తే.. కుటుంబంలో కలహాలు జరుగుతాయట. ఈ కుటుంబ కలహాల్లో పడి మునిగిపోతామని సూచించడానికి లోతైన జలాశయాలు కనిపిస్తాయి అంటారు నిపుణులు. త్వరలో ఏదో పెద్ద ప్రమాదం రాబోతుంది అని ఏటికి ఎదురీదడానికి సిద్ధంగా ఉండాలి అని ఈ కలలు హెచ్చరిస్తాయట.

ఇలాంటి కలల నుంచి బయట పడాలంటే.. కలహాలను దూరం పెట్టుకోవడం ఒకే మార్గం. రాబోయే ఆపదల నుంచి బయట పడటానికి ముందస్తు చర్యలు ఆలోచించాల్సిందే. ఎవరితోనైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడం ఉత్తమం. కలలో పళ్లు రాలినట్లు అనిపిస్తే కూడా అశుభ సూచకం అంటారు. కలలో పళ్లు రాలినట్లు అనిపించడానికి చాలా కారణాలు ఉంటాయి. అభద్రతా భావం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, తరచూ భయపడటం వంటివి ఈ కలలకు సూచకం అంటారు నిపుణులు.

కొన్ని పరిస్థితుల్లో కంట్రోల్ తప్పడం, గట్టిగా మాట్లాడలేకపోవడం, భయపడటం వంటివి కూడా ఇందుకు సంకేతాలేనట. ఈ రాబోయే విపత్తుల నుంచి బయట పడాలంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిచుకోవాలి. కలలో చిరిగిన దుస్తులు, దారాలు కనిపించినా మంచిది కాదు అంటారు స్వప్న శాస్త్ర నిపుణులు. అయితే సాధారణంగా దుస్తులను వ్యక్తి ఆశయాలకు, లక్ష్యాలకు సూచకంగా భావిస్తారు. కానీ, చిరిగిన దుస్తులు కనిపిస్తే వీటికి భంగం కలుగుతుంది అని నమ్ముతారు.

భవిష్యత్తులో ఓటములు ఎదుర్కోవాల్సి వస్తుందట. జీవితం అగమ్య గోచరంగా తయారైనప్పుడు అభద్రతా భావం ఎక్కువ అవుతుంది. జీవితంపై క్లారిటీ లేకపోవడం వల్ల కూడా ఇలాంటి కలలు ఎక్కువ వస్తాయట. కెరీర్‌, పర్సనల్ గోల్స్, రిలేషన్‌షిప్స్ వంటి వాటిని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

కలలో పగిలిన అద్దం కనిపిస్తే దురదృష్టం. లక్ష్యాలు నెరవేరకపోవడం, రిలేషన్‌షిప్‌ బ్రేక్ అప్, విడాకుల వంటివి జరగవచ్చట. అద్దం ప్రతిబింబాన్ని సూచిస్తుంది కాబట్టి మిమ్మల్ని మీకు చూపిస్తుంది అన్నట్టు. మీ మనసుకు గాయమైతే దానికి అయినట్లేనని అర్థం. ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడటానికి కొంత సమయం కేటాయించుకుంటే ఈ కలలకు దూరం అవచ్చట.