Homeక్రీడలుక్రికెట్‌Hardik Pandya no chance: హార్దిక్ కు నో ఛాన్స్.. దరిద్రం నీ చుట్టే తిరుగుతోందా...

Hardik Pandya no chance: హార్దిక్ కు నో ఛాన్స్.. దరిద్రం నీ చుట్టే తిరుగుతోందా భయ్యా..

Hardik Pandya no chance: హార్దిక్ పాండ్యాను దరిద్రం వెంటాడుతోంది. మామూలుగా కాదు.. అతడి చుట్టూ వైఫై లాగా తిరుగుతోంది. ఏ ముహూర్తంలో అయితే 2024లో ముంబై జట్టులో చేరిపోయాడో.. అప్పటినుంచి అతడి దిశ మొత్తం తీరో గమనం వైపే సాగుతోంది. భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు. కొత్తగా మిహికాతో మొదలు పెట్టాడు.

2024లో ముంబై జట్టు అంతగా ఆడలేదు. అతడి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 2025లో ముంబై జట్టు ఆట తీరు కాస్త మారినప్పటికీ.. హార్దిక్ పాండ్యా మీద విమర్శలు ఏమాత్రం తగ్గలేదు. పైగా అతడిని ముంబై జట్టుకు నాయకుడిగా ఎందుకు ఎంపిక చేశారని ఆ జట్టు మాజీ ప్లేయర్లు.. విశ్లేషకులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీనికి తోడు 2025 సీజన్ లో కూడా హార్దిక్ పాండ్యా కెరియర్ గొప్పగా చెప్పుకునే స్థాయిలో సాగలేదు. ఐపీఎల్ లో ముంబై జట్టు గొప్ప ప్రదర్శన చేయకపోవడం పట్ల హార్దిక్ పాండ్యా మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. 2026లో ఐపీఎల్లో అతని నాయకత్వంలో ముంబై జట్టు మరోసారి విఫలమైంది.

ఇటీవల అతడు ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో కూడా అతడు ఆడేది అనుమానమే. ఎందుకంటే బెంగళూరులో బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సులో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అతడి తొడ కండరాలకు గాయమైంది. అయితే ఆ గాయం తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఐర్లాండ్.. ఇంగ్లాండ్ జట్లతో జరిగే సిరీస్ లకు అతడికి మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వలేదు. అంతేకాదు సెప్టెంబర్ లో ఆసియా క్రీడల జట్టులో కూడా అతడికి అవకాశం లభించలేదు. దీంతో హార్దిక్ పాండ్యా అభిమానులు ఆవేదనలో కూరుకు పోయారు.

హార్దిక్ పాండ్యా బలమైన ఆటగాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు. ఒక అసలు సిసలైన ఆల్రౌండర్. 2027 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని అతనికి మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. బౌలింగ్ వేసేటప్పుడు హార్దిక్ ఇబ్బంది పడుతున్నాడని.. ఇంగ్లాండ్ సిరీస్లో యంగ్ ప్లేయర్లకు అవకాశాలు ఇచ్చి.. హార్దిక్ మీద వర్క్ లోడ్ తగ్గించి.. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది..

మరోవైపు విరాట్ కోహ్లీ విషయంలో కూడా ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఎందుకంటే అతడు ఇంగ్లాండ్ టూర్ కు అందుబాటులో ఉంటాడు అనే విషయం మీద స్పష్టత లేదు. ఈనెల 22న జరిగే సామర్థ్య పరీక్షలు విరాట్ కోహ్లీ గనుక పాస్ అయితేనే ఇంగ్లాండ్ టూర్ లో అవకాశం ఉంటుంది. కండరాల నొప్పితో విరాట్ కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. అతడు ప్రస్తుతం లండన్ లో ఉంటున్నాడు. అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. జూన్ 22న సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ వైద్య బృందం విరాట్ కోహ్లీని పరీక్షిస్తుంది. అందులో అతడు పాస్ అయితేనే ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఎంపిక అవుతాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular