Hardik Pandya: కెప్టెన్ గా రోహిత్ కంటే ఆ విషయం లో హార్దిక్ పాండ్య బెస్ట్…

చెన్నై మీద ఓడిపోయి రన్నరప్ గా నిలిపాడు.అయితే అంబానీ ఇప్పుడు హార్దిక్ పాండ్య ని మళ్ళీ ముంబై ఇండియన్స్ టీమ్ సైడ్ తీసుకోవాలని ఉద్దేశ్యం తో అతన్ని ట్రేడింగ్ చేసి ముంబై ఇండియన్స్ టీమ్ తరుపున తీసుకున్నాడు.

Written By: Gopi, Updated On : December 5, 2023 4:55 pm

Hardik Pandya

Follow us on

Hardik Pandya: ఐపీఎల్ 2022 లో లక్నో సూపర్ జాయింట్స్ ,గుజరాత్ టైటాన్స్ లాంటి రెండు టీంలు కొత్త గా ఐపిఎల్ లోకి ఎంటర్ అయ్యాయి.ఈ సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ కప్పు కొట్టి వాళ్లది ఎంత స్ట్రాంగ్ టిమో నిరూపించుకున్నారు. ఇక ఈ టీం కి హార్దిక్ పాండే కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆడిన మొదటి సీజన్ లోనే గుజరాత్ కి కప్పు అందించిన కెప్టెన్ గా పాండ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకా 2023 సీజన్ లో కూడా గుజరాత్ టీమ్ ని ఫైనల్ కి చేర్చి ఒక్క అడుగు దూరంలో చెన్నై మీద ఓడిపోయి రన్నరప్ గా నిలిపాడు.అయితే అంబానీ ఇప్పుడు హార్దిక్ పాండ్య ని మళ్ళీ ముంబై ఇండియన్స్ టీమ్ సైడ్ తీసుకోవాలని ఉద్దేశ్యం తో అతన్ని ట్రేడింగ్ చేసి ముంబై ఇండియన్స్ టీమ్ తరుపున తీసుకున్నాడు…

అయితే ముంబై ఇండియన్స్ టీం కి కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్నాడు కదా మళ్ళీ హార్థిక్ పాండ్య ఎందుకు అనే డౌట్ అందరికీ వస్తుంది. అయితే రోహిత్ శర్మ మహా అయితే ఇంకా ఒకటి, రెండు సీజన్ లకు మాత్రమే ఆడే అవకాశం ఉండటంతో ఫ్యూచర్ కెప్టెన్ గా పాండ్య పనికి వస్తాడని అందుకే ఆయన్ని టీమ్ లోకి తీసుకున్నట్టు గా తెలుస్తుంది…ఇక రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్య ముంబై టీం కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే అంబానీ ఏరి కోరి పాండ్య ని టీమ్ లోకి తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే రోహిత్ తో పోలిస్తే పాండ్య కొన్ని నిర్ణయాలను చాలా అగ్రెసివ్ గా తీసుకుంటాడు.

ఆ విషయం లో రోహిత్ కొంత నిదానంగా వ్యవహరిస్తాడు. అలాగే పాండ్య గ్రౌండ్ లో తనదైన రీతిలో కీలకమైన నిర్ణయాలు ఈజీగా తీసుకుంటూ త్వరిత గతిన మ్యాచ్ కు సంబంధించిన రిజల్ట్స్ ని మారుస్తాడు.అలాగే టీమ్ ను ముందు ఉండి నడిపించడంలో తను చాలా ముందు వరుసలో ఉంటాడు.అందుకే రోహిత్ కంటే హార్దిక్ బెటర్ అని ముంబై యాజమాన్యం ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ సీజన్ లోనే హార్దిక్ పాండ్య ని కెప్టెన్ గా చేసిన కూడా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

ఇక ప్రస్తుతం రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యే సరికి తను ఫామ్ లో ఉంటాడా లేదా అనే విషయం మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. హార్థిక్ పాండ్య కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించినట్లయితే రోహిత్ శర్మ నిరాశకి గురి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి…