Hair Care Tips: సాధారణంగా అమ్మాయిలు పొడవైన, ఒత్తైన జుట్టును ఇష్టపడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో తీవ్రమైన ఒత్తిడి, పొల్యూషన్ ఇలా పలు కారణాల వలన జట్టు ఊడిపోవడం, చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు జుట్టుకు ఎన్నెన్నో ప్రొడక్ట్స్ వాడుతుంటారన్న సంగతి కూడా తెలిసిందే. అందుకు తగినట్లుగానే మార్కెట్ లోకి రకరకాల ఆయిల్స్, సిరమ్ లు, షాంపూలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కానీ వీటిలో ఎక్కువగా కెమికల్స్ ఉండటంతో జట్టుకు సరికొత్త సమస్యలను తెచ్చి పెడుతుంటాయి. మరెలా అనుకుంటున్నారా?? అయితే ఎటువంటి కెమికల్స్ లేకుండా నాచురల్ గా ఉండే ఈ నివారణ చర్యను పాటించండి.. ఇంతకీ అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఉల్లిపాయ రసం.. అవును మీరు వింటున్నది నిజమే.. ఇది జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు సహజంగా నల్లగా ఒత్తుగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని రాయడం వలన తెల్లజుట్టు కూడా క్రమక్రమంగా నల్లగా మారుతుందంట. ఈ క్రమంలో ఉల్లిపాయ రసాన్ని జట్టుకు ఎలా ఉపయోగించాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఉల్లిపాయ రసంలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జట్టు నెరవకుండా ఉపయోగపడుతుందంట. అందులో ఉన్న సల్ఫర్ జట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జట్టు పెరిగేందుకు తోడ్పడుతుంది. అదేవిధంగా ఉల్లిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ చుండ్రు సమస్యను దూరం చేస్తుంది.
ఉల్లిపాయ రసాన్ని మాత్రమే కాకుండా దాంతో పాటు మరికొన్ని పదార్థాలను కలిపి జుట్టుకు పట్టిస్తే మరిన్న ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో మొదటిగా ఉల్లిపాయ రసానికి కాస్త ఉసిరి రసాన్ని కూడా యాడ్ చేసి తలకు పట్టించడం వలన తెల్లజుట్టు నల్లగా మారేందుకు తోడ్పడుతుంది. ఇందుకోసం రెండు చెంచాల ఉల్లి రసంలో అంతే మోతాదులో ఉసిరి రసాన్ని తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి సుమారు మూడు గంటల తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపుతో కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వలన రిజల్ట్ కనిపిస్తుంది.
తరువాత.. నల్లని కురుల కోసం ఉల్లిరసంలో సమాన మోతాదులో అలోవెరా జెల్ కలపాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించి రెండు నుంచి మూడు గంటల పాటు ఉంచాలి. ఆ తరువాత వాటర్ తో కడిగేయాలి. ఈవిధంగా వారానికి రెండు మూడు సార్లు ఉపయోగించవచ్చు.
అలాగే ఉల్లిపాయ రసంలో కొబ్బరినూనె కలిపి ఉపయోగించిన తెల్లజుట్టు సమస్యను నివారించుకోవచ్చు. ఉల్లిరసం, కొబ్బిరి నూనెను సమపాళ్లలో తీసుకుని జట్టుకు పట్టించాలి. అరగంట తరువాత షాంపుతో కడగాలి. క్రమం తప్పకుండా ఈ రెమిడీని పాటించడం వలన జుట్టు నల్లబడుతుంది.
మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయా? మరి ఇంకెందుకు ఆలస్యం. పైన చెప్పిన విధంగా ట్రై చేయండి.