Hardik Pandya Girlfriend Mahika Background: నటాషా తో విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా నూతన స్నేహితురాలిని ప్రపంచానికి పరిచయం చేశాడు. నటాషాతో విడాకులు తీసుకున్న అనంతరం జాస్మిన్ తో హార్దిక్ పాండ్యా కనిపించాడు. వారిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అనుసరించారు. దీంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని అందరూ అనుకున్నారు. దీనికి తోడు గత ఏడాది ఇదే సమయానికి వారిద్దరు గ్రీస్ దేశానికి వెకేషన్ కు వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరు తీసుకున్న ఫోటోలు సంచలనం కలిగించాయి. ఫోటోలలో వారిద్దరు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫోటోలు దిగారు.. ఆ ఫోటోలను జాస్మిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. హార్దిక్ పాండ్యా తన ఆసక్తిని వ్యక్తం చేశాడు.
దీంతో వారిద్దరు మింగిల్ అయ్యారని.. త్వరలోనే తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్తారని అందరు అనుకున్నారు. కానీ ఇక్కడే హార్దిక్ పాండ్యా అందరికి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జాస్మిన్ తో కాకుండా తాను వేరే అమ్మాయితో రిలేషన్ కొనసాగిస్తున్నట్టు చెప్పకనే చెప్పాడు.. మోడల్ మహిక శర్మతో తాను సన్నిహితంగా ఉంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మహిక నేపథ్యం కూడా చాలా గట్టిదే. ఆమె అనేక సినిమాలో నటించింది. మోడలింగ్ కూడా చేసింది. తనిష్క్, వివో, యూనిక్లో వంటి బ్రాండ్లకు ప్రచారకర్తగా నియమితురాలు అయింది. మ్యూజిక్ వీడియోలు.. ఇండిపెండెంట్ ఫిల్మ్ లలో నటించింది.. సామాజిక మాధ్యమాలలో మహిక అత్యంత చురుకుగా ఉంటుంది. తనకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది. తన అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. మహిక ఎకనామిక్స్, ఫైనాన్స్లో డిగ్రీ చేసింది. ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్ లో మోడల్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో హార్దిక్ కు మహిక కు పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇక్కడి దాకా దారి తీసింది. వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడడానికి ఎంతో కాలం పట్టలేదు. కొద్ది రోజులుగా తమ సంబంధాన్ని వారిద్దరు అత్యంత గుట్టుగా కొనసాగించారు. ఆ తర్వాతే మిగతా స్థాయికి తీసుకెళ్లారు. తాము ఇద్దరం రిలేషన్ లో ఉన్నట్టు ప్రకటించారు. వారిద్దరు కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక హార్దిక్ పాండ్యా కుమారుడు నటాషా వద్ద ఉంటున్నాడు. విడాకుల సమయంలోనే హార్దిక్ ఆమెకు భరణం చెల్లించాడు.. నటాషా కూడా మరొక వ్యక్తి తో కలిసి ఉంటోందని ప్రచారం జరుగుతోంది. అప్పుడప్పుడు ఆ వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. విషాద కొటేషన్స్.. మగవాళ్ళు మోసం చేస్తే ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనే సూక్తులను ఆమె లైక్ చేస్తోంది. దీనిని బట్టి హార్దిక్ పాండ్యా తనను మోసం చేశాడని ఆమె సంకేతాలిస్తోంది.