India-Afghanistan ties : “ఇక్కడ దమ్మున్నోడిదే రాజ్యం. సత్తా ఉన్నోడిదే సామ్రాజ్యం. ఎంత దూకుడు ఉంటే అంత సొంతమవుతుంది. ప్రపంచం మొత్తం సాగిలపడుతుంది” ఓ తెలుగు సినిమాలో పాపులర్ డైలాగ్ ఇది. ఇది డైలాగ్ మాత్రమే కాదు.. జీవిత సత్యం కూడా. ఇటువంటి విధానాలను అవలంబిస్తున్న మనుషులు మాత్రమే కాదు, దేశాలు కూడా ముందు వరుసలో ఉన్నాయి. అవి ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, ప్రపంచం మీద పెత్తనం సాగిస్తున్నాయి. ఇప్పుడు ఈ అవకాశం భారతదేశానికి వచ్చింది. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ ఇది ముమ్మాటికి నిజం.
చైనా వద్ద బీభత్సంగా బంగారం ఉంది. అయినప్పటికీ దానిని బయటకి విక్రయించదు. ఇవే కాకుండా ఇంకా కొన్ని అరుదైన లోహాలు, ఖనిజాలు ఆ దేశం వద్ద ఉన్నాయి. అయినప్పటికీ వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఒప్పుకోదు. అమెరికా కూడా అంతే.. బంగారం దగ్గరనుంచి మొదలు పెడితే ఇతర లోహాల వరకు వేటిని కూడా ఇతర దేశాలకు విక్రయించదు. పైగా ఇతర దేశాలలో ఆ నిల్వలు గనుక ఉండి ఉంటే కచ్చితంగా డీల్ కుదుర్చుకుంటుంది. డీల్ సాధ్యం కాకపోతే బెదిరింపులకు పాల్పడుతుంది. ఒత్తిళ్లు తీసుకొస్తుంది. డిఫెన్స్, ఎనర్జీ సెక్టర్లలో రేర్ ఎర్త్ మినరల్స్ అత్యంత కీలకం. ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీల తయారీ, టెక్నాలజీ, ఆర్మీ అవసరాలకు ఇవి అత్యంత కీలకం. నేషనల్ సెక్యూరిటీ పేరుతో చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఎక్కడ చైనా ప్రపంచ శక్తిగా అవతరిస్తుందని భయంతో అమెరికా కూడా రేర్ ఎర్త్ మినరల్స్ వేట మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ భూభాగంలో ఇవన్నీ ఉన్నాయని తెలుసుకున్న అమెరికా.. ఏకంగా 500 మిలియన్ డాలర్లతో పాకిస్తాన్ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అసలే కరువుతో ఉన్న పాకిస్తాన్ అమెరికా చెప్పిన ప్రతి మాటకు తల ఊపింది. ఈ క్రమంలోనే అమెరికా కంపెనీలు పాకిస్తాన్ దేశంలో మినరల్స్ వేట మొదలుపెట్టాయి. ప్రయోగాలు ప్రారంభించాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే తవ్వకాలు ప్రారంభమవుతాయి.
కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు, దాని పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో కూడా రేర్ ఎర్త్ మినరల్స్ విపరీతంగా ఉన్నాయి. ఇవి భూమి మీద అత్యంత విలువైన ఖనిజాలు. వీటి కోసమే అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ పాకిస్తాన్ దేశంతో ప్రేమ నటిస్తున్నాయి. పాకిస్తాన్ దేశంతో మనకు ఎలాగూ పడదు కాబట్టి.. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వైపు చూస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఆఫ్ఘనిస్తాన్ మనకు స్నేహ హస్తం చాచింది. పైగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ఆఫ్గనిస్తాన్ మంత్రి ఢిల్లీలో భేటీ అయ్యారు. కీలక విషయాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ లో నిల్వ ఉన్న ఎర్త్ మినరల్స్ విలువ వన్ మిలియన్ ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. మినరల్స్, ఎనర్జీ సెక్టార్లలో తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆఫ్గనిస్తాన్ ఇండియాను ఆహ్వానిస్తోంది.
లిథియం, ఐరన్ ఓర్, కాపర్, రేర్ ఎర్త్ వంటి ఎలిమెంట్స్ ఆఫ్ఘనిస్తాన్ మైన్స్ లలో దొరుకుతున్నాయి. వీటిని గనక భారత్ వినియోగించుకుంటే చైనాకు చెక్ పెట్టవచ్చు. అమెరికాను సవాల్ చేయవచ్చు. అవసరమైతే ప్రపంచాన్ని మొత్తం జయించవచ్చు. అయితే వచ్చిన ఈ అవకాశాన్ని భారత్ ఎలా వినియోగించుకుంటుంది.. ఏ స్థాయిలో పెట్టుబడులు పెడుతుంది.. భారత్ నుంచి ఏ కంపెనీలు పెట్టుబడులు పెడతాయి అనేది.. త్వరలోనే తెలుస్తుంది.