Rohit Sharma Big Six: రోహిత్ శర్మ ను టీమిండియాలోనే కాదు, ప్రపంచ క్రికెట్ లోనూ అతడిని హిట్ మాన్ పిలుస్తుంటారు. ఎందుకంటే అతడు బ్యాటింగ్ చేస్తుంటే అలా ఉంటుంది మరి. ఫాంతో అతనికి ఏ మాత్రం సంబంధం ఉండదు. వచ్చాడంటే మోత మోగాల్సిందే. బౌలర్ ఎవరైనా పర్వాలేదు.. బంతి ఎక్కడ పడినా పర్వాలేదు.. అతడికి కొట్టడం మాత్రమే తెలుసు. గట్టిగా కొడితే బంతి గింగిరాళ్ళు తిరుగుకుంటూ ఎక్కడికో వెళ్తుంది. అందువల్లే రోహిత్ కు బౌలింగ్ వేయాలంటే చాలామంది భయపడుతుంటారు. వెనకడుగు వేస్తుంటారు.
రోహిత్ శర్మను ఇటీవల కాలంలో మైదానంలో అభిమానులు ఎక్కువగా చూడలేదు. దీనికి కారణం అతడు పరిమిత ఓవర్ల ఫార్మాట్ నుంచి గత ఏడాది తప్పుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి కూడా దూరం జరిగాడు. ప్రస్తుతం అతడు ఆడుతున్నది కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే. అయితే అందులో నుంచి కూడా మేనేజ్మెంట్ సారధిగా అతనిని తప్పించింది. అతని స్థానంలో గిల్ కు అవకాశం కల్పించింది. దీంతో గిల్ ప్రస్తుతం టీమిండియా కు సారధిగా వ్యవహరిస్తున్నాడు. టెస్ట్ లలో సారధిగా బాధ్యతలు స్వీకరించిన గిల్.. ఇంగ్లాండ్ సిరీస్లో తనను తాను నిరూపించుకున్నాడు. వెస్టిండీస్ సిరీస్ లోను అదరగొడుతున్నాడు. అదృష్టానికి బోనస్ అన్నట్టుగా ప్రస్తుతం అతడు వన్డే జట్టుకు సారధి అయ్యాడు. ఈనెల 19 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ ద్వారా తన నేర్పరితనాన్ని గిల్ నిరూపించుకోబోతున్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో రోహిత్, కోహ్లీ ఆడబోతున్నారు. దాదాపు చాలా రోజుల గ్యాప్ తర్వాత వీరిద్దరూ ఆడుతుండడం అభిమానులకు ఆనందం కలిగించే విషయం. ఈ నేపథ్యంలో రోహిత్ తన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ముంబైలో జోరుగా ప్రాక్టీస్ చేశాడు. అయితే అతడు కొట్టిన భారీ షాట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అతడు కొట్టిన దెబ్బకు బంతి ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఆ బంతి పార్కింగ్ చేసిన ఖరీదైన లంబోర్గిని కారు అద్దాలను బద్దలు కొట్టేసింది. అయితే ఆ కారు ఎవరిది అనే చర్చ మొదలైంది. ఆ కారు మరెవరిదో కాదు.. రోహిత్ శర్మ దే నని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
ఇటీవలే దాదాపు 5 కోట్లు వెచ్చించి అతడు ఆ కారు కొనుగోలు చేశాడు. ఆ కారులోనే ముంబై వీధులలో రోహిత్ చక్కర్లు కొడుతున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ కు దానితోనే హాజరయ్యాడు. కానీ అతడు కొట్టిన దెబ్బకు బంతి లంబోర్ఘిని కారు అద్దాలను బద్దలు కొట్టింది. దీనివల్ల భారీగానే నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఎంత నష్టం జరిగింది? ఆ కారు అద్దాలను ముంబైలో మరమ్మతు చేయవచ్చా? దీనిపై రోహిత్ రియాక్షన్ ఎలా ఉంది? ఈ ప్రశ్నలపై నెట్టింట చర్చ నడుస్తోంది. మరోవైపు రోహిత్ ప్రాక్టీస్ చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా జట్టుతో టీమ్ ఇండియా 3 వన్డేల సిరీస్ ఆడబోతోంది.
Rohit Sharma hit that six, it went straight and landed on his own Lamborghini. pic.twitter.com/LBINvmeDYc
— ⁴⁵ (@rushiii_12) October 10, 2025