https://oktelugu.com/

BIgg Boss Season 8 : బిగ్ బాస్ హౌస్లో విడాకుల జంట… మైండ్ బ్లాక్ చేస్తున్న సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్!

ఇక సీజన్ 8 కంటెస్టెంట్స్ వీరే అంటూ ఓ లిస్ట్ వైరల్ అవుతుంది. దాని ప్రకారం ఇటీవల విడాకులు తీసుకున్న జంట హౌస్లో అడుగుపెడుతున్నారట. మరి అదే నిజమైతే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి అవుతుంది. గతంలో పెళ్ళైన జంటలు హౌస్లోకి వెళ్లారు. కానీ విడాకులు తీసుకున్న కపుల్ ఒకే సీజన్లో పాల్గొనడం ఇదే మొదటిసారి అవుతుంది. వారు యూట్యూబర్స్ నేత్ర, వంశీ.

Written By:
  • S Reddy
  • , Updated On : July 18, 2024 / 10:19 PM IST
    Follow us on

    BIgg Boss Season 8 : బిగ్ బాస్ సీజన్ 8కి రంగం సిద్ధమైంది. మేకర్స్ చకచకా పనులు పూర్తి చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ నిర్మిస్తున్నారని సమాచారం. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుందట. ఎప్పటిలాగే అధికారిక ప్రకటనకు ముందే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అయ్యింది.

    బిగ్ బాస్ నిబంధనల ప్రకారం లాంచింగ్ ఎపిసోడ్ ముగిసే వరకు కంటెస్టెంట్స్ ఎవరనేది సస్పెన్సు. ఎంపికైన కంటెస్టెంట్స్ కూడా బయట చెప్పకూడదు. తాము బిగ్ బాస్ హౌస్ కి వెళుతున్న విషయం ఎవరితో షేర్ చేయకూడదు. బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఒక పండగలా భారీ ఎత్తున ప్రతి సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ నిర్వహిస్తారు. అదిరిపోయే పెర్ఫార్మన్స్ లు ఇస్తూ, తమ టాలెంట్ చూపిస్తూ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు వేదిక మీదకు వస్తారు. హోస్ట్ నాగార్జున వారిని ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు.

    కాసేపు వారితో ముచ్చటించి బిగ్ బాస్ హౌస్లోకి నాగార్జున సాదరంగా పంపిస్తాడు. అయితే ప్రతి సీజన్ కి ముందు కొందరు కంటెస్టెంట్స్ పేర్లు ముందుగానే లీక్ అవుతాయి. అందుకు పలు కారణాలు ఉన్నాయి. నటులు సడన్ గా సీరియల్ మానేయవచ్చు. కమెడియన్స్ తాము చేస్తున్న షోల నుండి తప్పుకోవచ్చు. యాభై శాతానికి పైగా కంటెస్టెంట్స్ పేర్లు అధికారిక ప్రకటనకు ముందే తెలిసిపోతాయి. అయినప్పటికీ లాంచింగ్ ఎపిసోడ్ మీద ఆసక్తి తగ్గదు.

    ఇక సీజన్ 8 కంటెస్టెంట్స్ వీరే అంటూ ఓ లిస్ట్ వైరల్ అవుతుంది. దాని ప్రకారం ఇటీవల విడాకులు తీసుకున్న జంట హౌస్లో అడుగుపెడుతున్నారట. మరి అదే నిజమైతే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి అవుతుంది. గతంలో పెళ్ళైన జంటలు హౌస్లోకి వెళ్లారు. కానీ విడాకులు తీసుకున్న కపుల్ ఒకే సీజన్లో పాల్గొనడం ఇదే మొదటిసారి అవుతుంది. వారు యూట్యూబర్స్ నేత్ర, వంశీ.

    ఈ కపుల్ కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. మనస్పర్థలు తలెత్తి విడాకులు తీసుకున్నారు. నేత్ర, వంశీ బిగ్ బాస్ సీజన్ 8కి ఎంపికయ్యారని సమాచారం. అలాగే కమెడియన్, క్యారెక్టర్ రోల్స్ చేసిన హేమ, సురేఖావాణి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడుతున్నారట. డ్రగ్స్ కేసులో పట్టుబడి జైలుపాలైన హేమ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు.

    ఇక సెలబ్రిటీల జాతకాలు చెబుతూ కాంట్రవర్సీలు రాజేసే వేణు స్వామి సైతం బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాడట. స్టార్ హీరోయిన్స్ దగ్గర లక్షలు తీసుకుని పూజలు చేసే వేణు స్వామి భారీగా ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. మాజీ జబర్దస్త్ కమెడిన్ కిరాక్ ఆర్పీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

    జబర్దస్త్ నుండి ప్రతి సీజన్ కి ఒకరో ఇద్దరో కమెడియన్స్ బిగ్ బాస్ కి వస్తారు. ఈసారి బుల్లెట్ భాస్కర్, పొట్టి నరేష్, రియాజ్ వస్తున్నారంటూ విశ్వసనీయ సమాచారం. హాట్ యాంకర్స్ విష్ణుప్రియ, రీతూ చౌదరి, వర్షిణి సుందరరాజన్ ఈ లిస్ట్ లో ఉన్నారట. సోషల్ మీడియా స్టార్స్ బర్రెలక్క, కుమారీ ఆంటీ, అలాగే బంచిక్ బబ్లు, కామనర్ అమృత ప్రణయ్ బిగ్ బాస్ షోకి ఎంపిక అయ్యారని సమాచారం. సెప్టెంబరు 1 లేదా 8న లాంచింగ్ ఎపిసోడ్ అంటున్నారు. ఆ రోజు పూర్తి స్పష్టత రానుంది. మరోసారి నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు తీసుకుంటారట. సీజన్ 7కి మించి సీజన్ 8 ఉంటుందట.