spot_img
Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం...

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ వేసినా.. ఆఫ్ స్పిన్ వేసినా ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు కనిపించాల్సిందే. బంతులు ఎదుర్కోవడంలో విఫలం కాడమే కాదు.. వికెట్లు సమర్పించుకుని వెళ్తారు. అటువంటి హర్భజన్ సింగ్ ఓ 15 సంవత్సరాల కుర్ర క్రికెటర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి.

జియో హాట్ స్టార్ చర్చ వేదికలో హర్భజన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమకాలీన క్రికెట్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న 15 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ గురించి హర్భజన్ మాట్లాడారు. అతనికి భయం అంటే ఏంటో తెలియదని.. అతడు బ్యాటర్ కాదని.. డైనమైట్ అని వ్యాఖ్యానించారు. “బంతి ఎలా పడినా సరే అతడు ఆడతాడు. ఎలాగైనా కొడతాడు. తన పరిధిలోకి వస్తే విశ్వరూపం చూపిస్తాడు. అతనికి భయం అంటే పదానికి అర్థం తెలియనట్టు కనిపిస్తోంది. అతని విశ్వాసం చూసిన తర్వాత.. అతడి బ్యాటింగ్ విధ్వంసం గమనించిన తర్వాత ఏం మాట్లాడినా సరే తక్కువే అవుతుందని” హర్భజన్ వ్యాఖ్యానించాడు.

“సూర్య వంశీ చేతిలో టీమిండియా భవిష్యత్తు భద్రంగానే ఉంటుంది. కొన్నిసార్లు అతడు అంచనాలను అందుకోలేకపోవచ్చు. కానీ మెజారిటీ సమయాల్లో మాత్రం అతడు అదరగొడతాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే అతడు విధ్వంసానికి పరాకాష్ట లాంటి ఆటగాడు. బంతిని చూడగానే సరే ఒక అంచనాకు వస్తాడు. వెంటనే తనదైన స్టైల్ లో దానికి పనిష్మెంట్ ఇస్తాడు. అటువంటి బ్యాటర్లు ఇటీవల కాలంలో పెద్దగా కనిపించలేదు. కానీ ఆ భర్తీని సూర్య వంశీ చేస్తున్నాడు. అతడు ఆడే తీరు.. బంతులను కొట్టే తీరు అద్భుతంగా ఉందని.. అతడు బ్యాటింగ్ చేస్తుంటే ఆమోగంగా అనిపిస్తోందని” హర్భజన్ వ్యాఖ్యానించాడు.

ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ సిరీస్ లో సూర్య వంశీ అంతగా ఆకట్టుకోలేదు. ఇంగ్లాండ్ బౌలర్ల ఉచ్చులకు చిక్కాడు. భారీ ఇన్నింగ్స్ లు ఆడ లేక చేతులెత్తేశాడు. దీంతో అతనికి ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదవ టి20 మ్యాచ్లో అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలో అతని పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అతడు జింబాబ్వే సిరీస్ కు ఎంపికయ్యాడు. నేటి నుంచి జరిగే ఆ సిరీస్లో అతడు ఓపెనర్ గా రంగంలోకి దిగుతాడు. తన పూర్వపు ఫామ్ అందుకుంటే మాత్రం ఇక అతడికి తిరుగు ఉండదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper